వనపర్తి, సెప్టెంబర్ 20: జూరాల Project కేంద్రంగా political heat రాజుకుంటోంది. జూరాల Reservoirలో నీళ్లు ఉన్నా Palamuru రైతుల నోట్లో మట్టి కొట్టి Andhra Pradeshకు నీళ్లు ఇచ్చారని BRS Working President KTR, CM Revanth Reddyపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు Jurala Left Canal Gateను రైతులు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకోవడంతో కలకలం రేగింది.
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని Jurala Project నుంచి పంట పొలాలకు నీరు విడుదల చేయాలని రైతులు చేసిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయించిన రైతులు, చివరకు Left Canal Gatesను స్వయంగా ఎత్తి దిగువకు నీటిని వదులుకున్నారు.
Jurala Left Canal ఆయకట్టుకు నీరు విడుదల కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న వనపర్తి జిల్లా రైతులు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం లేదని, ప్రస్తుతం తాగునీటి అవసరాలకు సరిపడా మాత్రమే నీరు ఉందని Jurala Project అధికారులు రైతులకు వివరించారు. అయితే తమ పంట పొలాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు వదలాల్సిందేనని రైతులు పట్టుబట్టారు.
అయినా అధికారులు స్పందించకపోవడంతో రైతులు ముందుకు కదిలారు. Jurala Left Canal Gatesను స్వయంగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై Jurala Project అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
ఇవి కూడా చదవండిరెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
జూరాల… https://t.co/zqpqtzttCr pic.twitter.com/jc1jkuxFxF
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2026
మరోవైపు వనపర్తి జిల్లా పెబ్బేరులో పర్యటించిన BRS Working President KTR, రైతులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నారని, సాగునీటిని కూడా అందించలేకపోతున్నారని Congress Governmentపై తీవ్ర విమర్శలు చేశారు.
పెబ్బేరు, గుమ్మడంలో Electricity Substationsను రైతులతో కలిసి పరిశీలించిన KTR, అక్కడ అధికారులు రైతుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారని అన్నారు. Jurala Reservoirలో నీళ్లు ఉన్నాయని, అయినా Palamuru రైతుల నోట్లో మట్టి కొట్టి Andhra Pradeshకు నీళ్లు ఇచ్చారని CM Revanth Reddyపై KTR విమర్శలు చేశారు.
కృష్ణా నదిలో ఈ సంవత్సరం భారీగా నీళ్లు వచ్చాయని KTR పేర్కొన్నారు. ఈ వర్షాకాలంలో మొత్తం 248 TMCల నీళ్లు కృష్ణా నదికి వచ్చాయని అన్నారు. అయినా Palamuru రైతులకు సాగునీరు ఇవ్వకుండా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని విమర్శించారు. Jurala ఆయకట్టుకు ప్రభుత్వం కేవలం 18 TMCల నీటిని మాత్రమే ఇచ్చిందని KTR ఆరోపించారు.
అదే సమయంలో Srisailam నుంచి 100 TMCల Krishna Waterను AP తరలిస్తోందని KTR విమర్శించారు. Juralaలో నీళ్లు ఉన్నప్పటికీ Palamuru రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు.
గత నెలలో వర్షాలు కురిసిన సమయంలో Jurala Projectకు వరద ప్రవాహం కొనసాగింది. అయితే కొన్ని రోజులుగా వరద ప్రవాహం లేకపోవడంతో Jurala ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగడం, చివరకు Canal Gatesను స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


