కోదాడలో మెగా జాబ్ మేళా.. వేలాది ఉద్యోగ అవకాశాలు

సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా జరగనుంది. 250కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండనున్నాయి.

Uttam KumarReddy Kodad Mega Job Mela
Uttam KumarReddy Kodad Mega Job Mela

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం కల్పించేలా సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19, 2026న ఉదయం 8 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 250కి పైగా కంపెనీలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

కోదాడ మెగా జాబ్ మేళాకు సంబంధించి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వేలాది ఉద్యోగ అవకాశాలు

ఈ మెగా జాబ్ మేళాలో 250కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. వివిధ రంగాల్లోని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండనున్నందున నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతతో పాటు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాలను పొందేందుకు అభ్యర్థులు సిద్ధంగా రావాలని సూచించారు.

జాబ్ మేళా వేదిక, సమయం

తేదీ: 19 సెప్టెంబర్ 2026, శనివారం

సమయం: ఉదయం 8:00 గంటల నుంచి

వేదిక: సెయింట్ జోసెఫ్, సీసీఆర్ విద్యానిలయం, కోదాడ, తెలంగాణ

పాల్గొనే సంస్థలు: 250కి పైగా కంపెనీలు

ఉద్యోగ అవకాశాలు: వేలాది ఖాళీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం kodadmegajobmela.com
వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావచ్చు. పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రచార మాధ్యమాల్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.

అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఇతర అవసరమైన పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

Kodad Mega Job Mela
Kodad Mega Job Mela
About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »