కరీంనగర్‌లో ఒకేసారి రెండు ATMల చోరీ.. Gas Cutterతో ధ్వంసం

కరీంనగర్‌ జిల్లాలో తెల్లవారుజామున రెండు SBI ATMలలో చోరీ జరిగింది. CC కెమెరాలకు Spray కొట్టి Gas Cuttersతో ATMలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు.

Karimnagar ATM Theft
Karimnagar ATM Theft

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 20: కరీంనగర్‌ జిల్లాలో తెల్లవారుజామున రెండు ATMల చోరీలు కలకలం రేపాయి. జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో Scorpio వాహనంలో వచ్చిన దొంగలు రెండు వేర్వేరు ప్రాంతాల్లోని SBI ATMలను టార్గెట్ చేశారు. CC కెమెరాలకు Spray కొట్టి, Cables, Alarm Wiresను కట్ చేసి Gas Cuttersతో ATMలను ధ్వంసం చేశారు. ఒక ATMలో దాదాపు రూ.8 లక్షలు చోరీ అయినట్లు సమాచారం.


కరీంనగర్‌ Rural Police Station పరిధిలోని దుర్షేడ్‌లో ఈ చోరీ జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో Scorpio వాహనంలో వచ్చిన దుండగులు SBI ATMలోకి చొరబడ్డారు. ముందుగా CC కెమెరాలకు Spray కొట్టారు. అనంతరం Cables, Alarm Wiresను కట్ చేసి Gas Cuttersతో ATMను ధ్వంసం చేశారు. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో LMD Police Station పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న SBI ATMను కూడా దొంగలు టార్గెట్ చేశారు. అక్కడ కూడా ఇదే తరహాలో ATMను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లినట్లు సమాచారం. రెండు ఘటనలు ఒకే సమయంలో జరగడంతో ఒకే Gang ఈ చోరీలకు పాల్పడిందా? లేక వేర్వేరు ముఠాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీకి ముందు దుండగులు Recce నిర్వహించి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా రాత్రి వరకు జనసంచారం ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా ఉండటాన్ని అనుకూలంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చోరీల్లో Technologyని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. CC కెమెరాలు పనిచేయకుండా Spray కొట్టడంతో పాటు Gas Cuttersతో ATMలను కట్ చేశారు. CC కెమెరా Footageలో ముగ్గురు, నలుగురు వ్యక్తులు కనిపించినట్లు సమాచారం. దొంగల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ.. ఆమె నిజంగా మహిళేనా? లేక మహిళ వేషంలో వచ్చిన వ్యక్తా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

మరోవైపు రెండు ATMల నుంచి ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైందనే విషయం Bank అధికారులు లెక్కలు పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆదివారం కావడంతో ATMల్లో సాధారణం కంటే ఎక్కువ నగదు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో గతంలో జరిగిన PMJ Jewellers దోపిడీ, ఇతర చోరీ ఘటనల నేపథ్యంలో తాజా ATM దోపిడీలు స్థానికుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. Banks, ATMలు, Jewellery Shops, Industrial Areas వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో Police Patrolling, నిఘా మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు CC కెమెరా Footage, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. రెండు ATMల చోరీలకు ఒకే Gang కారణమా? వేర్వేరు Gangsనా? ఎంతమంది నిందితులు ఉన్నారు? అనే అంశాలపై Investigation కొనసాగుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »