కరీంనగర్, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ జిల్లా అధికారులు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రామగుండం మండలం వెలిచాల గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను అధికారులు సందర్శించారు. విద్యార్థులకు ప్లాస్టిక్, Single Use Plastic వల్ల కలిగే అనర్థాలు, పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు.
నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ జిల్లా Coordinator తిప్పర్తి రమేష్ విద్యార్థులకు వివరించారు. Single Use Plasticను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
అదే విధంగా RRR (Reduce, Reuse and Recycle) విధానంపై కూడా విద్యార్థులతో అధికారులు చర్చించారు. చెత్తను నాలుగు రకాలుగా ఎలా విభజించాలి, ఏ రకమైన చెత్తను ఏ డబ్బాలో వేయాలి అనే విషయాలను Miniature, Practical Demonstration ద్వారా విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు కూడా ఈ Practical Demonstrationలో చురుగ్గా పాల్గొని చెత్తను వేర్వేరు రకాలుగా విభజించే విధానాన్ని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా Coordinator తిప్పర్తి రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన పరిశుభ్రత నియమాలను వివరించినట్లు తెలిపారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా చిన్న వయసు నుంచే పరిశుభ్రతపై విద్యార్థుల్లో చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
Single Use Plastic వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కూడా విద్యార్థులకు స్పష్టంగా వివరించినట్లు రమేష్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు Reduce, Reuse, Recycle విధానాలను నిత్య జీవితంలో పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ విద్యార్థులతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రతను పాటించాలని, Single Use Plasticను వినియోగించకుండా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో Single Use Plastic వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకున్నామని తెలిపారు. తమ గ్రామంలో కూడా Single Use Plasticను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, కార్యక్రమాలు, ఫంక్షన్లలో Leafy Plates, Steel Glasses వినియోగిస్తున్నామని చెప్పారు. దుకాణాల్లో కూడా Plastic Coversకు బదులుగా Bio Plastic Covers ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు పరిశుభ్రతను పాటించడంతో పాటు Single Use Plasticను ఉపయోగించకుండా ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు.


