బ్లడ్ క్యాన్సర్ అంటే భయం వద్దు.. ప్రాణాలను కాపాడే ఆ ‘మూడు’ లక్షణాలు ఇవే!

Blood Cancer: రక్త క్యాన్సర్ లక్షణాలు సాధారణ అనారోగ్యంలా కనిపించి మోసం చేస్తాయి. లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి రకాలపై అవగాహనతో పాటు, సకాలంలో గుర్తించి ఆధునిక చికిత్సలు పొందితే రక్త క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే.

Blood Cancer Symptoms, Causes and Modern Treatments in Telugu
Blood Cancer Symptoms, Causes and Modern Treatments in Telugu

Blood Cancer

హైదరాబాద్: రక్త క్యాన్సర్ (బ్లడ్ క్యాన్సర్-Blood Cancer) అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ముఖ్యంగా మన దేశం ఈ వ్యాధి నిర్ధారణలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతున్నప్పటికీ, దీని లక్షణాలు సాధారణ జ్వరం లేదా నీరసంలా కనిపించి మనల్ని పక్కదోవ పట్టిస్తుంటాయి. అందుకే ఈ వ్యాధిపై సరైన అవగాహన పెంచుకుని, సకాలంలో గుర్తించి చికిత్స పొందడం ఎంతో ముఖ్యం.

రక్త క్యాన్సర్ రకాలు: రక్తకణాలు లేదా అవి పుట్టే ఎముక మజ్జపై ఈ(Blood Cancer) క్యాన్సర్ ప్రభావం చూపుతుంది. దీనిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు:

లుకేమియా: ఇది మన దేశంలో సర్వసాధారణం.

లింఫోమా: రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

మైలోమా: ప్లాస్మా కణాలను దెబ్బతీస్తుంది.

గుర్తించాల్సిన లక్షణాలు: సాధారణ వ్యాధుల్లా అనిపించినా, ఈ క్రింది లక్షణాలు 2-3 వారాల పాటు తగ్గకుండా ఉంటే జాగ్రత్తపడాలి.

విపరీతమైన నీరసం , చిన్న పనికే ఆయాసం రావడం, నెల రోజులకు పైగా పదే పదే జ్వరం రావడం, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, రాత్రి వేళల్లో విపరీతంగా చెమటలు పట్టడం, చిగుళ్లు, ముక్కు నుండి రక్తం కారడం లేదా చర్మంపై కమిలినట్లు మచ్చలు పడటం వంటి లక్షణాలు ఉంటాయి.

కారణాలు ఏమిటి? మనం పీల్చే గాలిలోని కాలుష్యం, తాగే కలుషిత నీరు, ఆహారంలోని పురుగుమందుల రసాయనాలే దీనికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా ‘బెంజీన్’ వంటి రసాయనాలు మన శరీరంలోకి చేరడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. రసాయన ఎరువులతో పండించిన పంటలు, వాహన కాలుష్యం ఈ వ్యాధి విస్తరణకు దోహదం చేస్తున్నాయి.

నివారణ మార్గాలు: వ్యాధి వచ్చాక బాధపడేకంటే, రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కూరగాయలు, పండ్లను వాడుకునే ముందు సోడియం బైకార్బొనేట్ కలిపిన నీటితో శుభ్రంగా కడిగి, తొక్క తీసి వాడాలి. సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ (సేంద్రీయ) ఆహారాన్ని ఎంచుకోవాలి. నీటిని శుద్ధి చేసే ఆరో (RO) ఫిల్టర్లను ఉపయోగించాలి.

ఆధునిక చికిత్సలు: ఒకప్పుడు రక్త క్యాన్సర్ అంటే భయం ఉండేది, కానీ నేడు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీతో పాటు ‘టార్గెటెడ్ థెరపీ’, ‘ఇమ్యునోథెరపీ’ వంటి పద్ధతుల ద్వారా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో వ్యాధిని నయం చేయవచ్చు. ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Transplant, కొత్తగా వచ్చిన ‘కార్-టి సెల్ థెరపీ’ ప్రాణాపాయం నుండి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మధుమేహంలాగే కొన్ని రకాల రక్త క్యాన్సర్లను నియంత్రణలో ఉంచుతూ సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

సరైన సమయంలో రోగ నిర్ధారణ జరిగితే రక్త క్యాన్సర్‌ను జయించడం అసాధ్యమేమీ కాదు. లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండి, వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు.

Also Read: సపోటా పండు అమృతమే.. కానీ ఆ ఒక్క సమస్య ఉన్నవారు తింటే మాత్రం ప్రమాదమే!

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: రక్త క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి?

A: ఎక్కువ నీరసం, తరచూ జ్వరం, బరువు తగ్గడం, రాత్రి చెమటలు పట్టడం, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

Q2: రక్త క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఏమిటి?

A: వాయు కాలుష్యం, రసాయనాలు (బెంజీన్), పురుగుమందులు, కలుషిత నీరు ప్రధాన కారణాలుగా గుర్తించారు.

Q3: రక్త క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా?

A: కొన్ని రకాల రక్త క్యాన్సర్లు పూర్తిగా నయం అవుతాయి. మరికొన్ని దీర్ఘకాలికంగా నియంత్రణలో ఉంచవచ్చు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »