డిగ్రీ పూర్తి చేసి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. SBI Youth for India Fellowship 2026-27 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ తెలిపింది. గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేయాలనుకునే యువతకు ఈ ఫెలోషిప్ ద్వారా 13 నెలలపాటు శిక్షణతో పాటు ఆకర్షణీయమైన స్టైపెండ్ అందించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
దేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం యువతను ప్రోత్సహించేందుకు SBI Youth for India Fellowship కార్యక్రమాన్ని 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 27 బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 20 రాష్ట్రాల్లో 250కు పైగా గ్రామాల్లో 580 మంది యువత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, మహిళా సాధికారత వంటి రంగాల్లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఈ ఫెలోషిప్ కల్పిస్తుంది.
SBI Youth for India Fellowship ముఖ్య ఉద్దేశ్యం
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే SBI Youth for India Fellowship ప్రధాన లక్ష్యం. పట్టణాల్లో చదువుకున్న యువత గ్రామాల్లో పని చేయడం ద్వారా అక్కడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాల కోసం కృషి చేయాలని ఈ కార్యక్రమం ఉద్దేశిస్తోంది.
ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులు వివిధ గ్రామాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీనివల్ల గ్రామీణ సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా యువతకు విలువైన అనుభవం కూడా లభిస్తుంది.
అర్హతలు, ఫెలోషిప్ కాలవ్యవధి: SBI Youth for India Fellowship 2026 కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అక్టోబర్ 4, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- అభ్యర్థుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి
- భారతదేశం, నేపాల్, భూటాన్ పౌరులు లేదా OCI/NRI స్టేటస్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి ఆసక్తి ఉండాలి
ఈ ఫెలోషిప్ కాలవ్యవధి 13 నెలలు. ఈ సమయంలో అభ్యర్థులు గ్రామాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
SBI Youth for India Fellowship ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు.
- మొదట అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం రూరల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పూర్తి చేయాలి.
- మొదటి దశలో ఎంపికైన వారికి గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లో ప్రతిభ చూపిన వారికి తుది ఎంపిక జరుగుతుంది.
- ఇంటర్వ్యూ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ పంపించి ఫెలోషిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తారు.
స్టైపెండ్, ఇతర ప్రయోజనాలు
ఈ SBI Youth for India Fellowship 2026 ద్వారా ఎంపికైన వారికి ఆకర్షణీయమైన ఆర్థిక సాయం అందించనున్నారు.
వసతి కోసం నెలకు – ₹16,000
స్థానిక ప్రయాణ ఖర్చులకు – ₹2,000
ప్రాజెక్ట్ ఖర్చులకు – ₹2,000
ప్రొఫెషనల్ లెర్నింగ్ కోసం – ₹1,000
అంటే మొత్తంగా నెలకు ₹21,000 స్టైపెండ్ అందుతుంది.
13 నెలల ఫెలోషిప్ పూర్తయ్యాక అదనంగా ₹1,10,000 అలవెన్స్ కూడా ఇస్తారు. మొత్తం లెక్కపెడితే దాదాపు ₹3.83 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.
అదనంగా:
- 3AC రైలు ప్రయాణ ఖర్చులు
- శిక్షణ కార్యక్రమాల ప్రయాణ ఖర్చులు
- మెడికల్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
- SBI Foundation నుంచి అధికారిక సర్టిఫికెట్ అందించనున్నారు.
అప్లై చేసే విధానం
SBI Youth for India Fellowship 2026 కు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ youthforindia.org ఓపెన్ చేయాలి
2. హోమ్ పేజీలో SBI Youth for India Fellowship 2026-27 పై క్లిక్ చేయాలి
3. “Login Now” ఎంపికపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
4. వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేయాలి
5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
6. వివరాలు చెక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 30