బడ్జెట్–2026లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు
GST పరిధిలోకి ఇంధనాలు వస్తే పన్ను భారం తగ్గే చాన్స్
LPG, గ్యాస్ సబ్సిడీతో సామాన్యులకు ఉపశమనం
- ఆర్థిక వృద్ధి వేగవంతం
- ఉద్యోగ సృష్టి
- సామాజిక సమానత్వం
- దీర్ఘకాలిక స్థిరత్వం
ఇంధన ధరలపై కీలక నిర్ణయాలు?
- పెట్రోల్, డీజిల్‌పై
- కేంద్ర ఎక్సైజ్ సుంకం
- రాష్ట్ర VAT
- మొత్తం పన్ను భారం 50–60 శాతం వరకు ఉంటుంది
GST పరిధిలోకి పెట్రోల్, డీజిల్?
పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా ముడి చమురు, సహజ వాయువు, విమాన టర్బైన్ ఇంధనం (ATF) వంటి ఇంధనాలను GST పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవేళ వీటిని 5% GST శ్లాబ్‌లో చేర్చితే పన్ను భారం తగ్గే అవకాశం అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పన్నులు పెరుగుతాయా? తగ్గుతాయా? :
అయితే, ఇంధనాలను GST పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ లోటు వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా ఉంది. అయినప్పటికీ.. ద్రవ్యోల్బణ నియంత్రణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, సామాన్యులపై భారం తగ్గించడానికే ప్రాధాన్యం
అన్న కారణాలతో ఇంధన ధరలు తగ్గించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
LPG, గ్యాస్‌పై ఊరట?
బడ్జెట్‌లో గృహ వినియోగదారులకు ఊరటనిచ్చేలా… LPG తక్కువ వసూళ్లకు పరిహారంగా సుమారు రూ.30,000 కోట్ల వరకు సబ్సిడీ/పరిహారం ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది సాధారణ కుటుంబాలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు.
చమురు ఉత్పత్తి, అన్వేషణకు ప్రోత్సాహం :
ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్ దేశీయ చమురు ఉత్పత్తిని 100 మిలియన్ మెట్రిక్ టన్నులు (MMT) కు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో చమురు అన్వేషణ, కొత్త ఉత్పత్తి ప్రాజెక్టులుకు సంబంధించి పన్ను సెలవులు, తక్కువ సుంకాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం:
- గ్రీన్ హైడ్రోజన్
- సౌర విద్యుత్
- పవన విద్యుత్ రంగాలకు
- అధిక సబ్సిడీలు
- కొత్త ప్రోత్సాహక పథకాలు
- ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


