Social Media Ban | పిల్లలను డిజిటల్ ప్రపంచంలోని ముప్పు నుంచి కాపాడేందుకు మాల్దీవులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు వారికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు. సైబర్ బులీయింగ్, ఆన్‌లైన్‌లో ప్రమాదకర పరిచయాలు వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల భద్రత ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ మీడియా సంస్థ పీఎస్‌ఎం న్యూస్ వెల్లడించింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, పిల్లలకు ప్రమాదకరంగా భావించే కొన్ని సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఇతర దేశాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.
Read Also : చంద్రుడి దక్షిణ ధ్రువంలో మూన్ బేస్ ఏర్పాటు చేయనున్న నాసా.. ప్రైవేటు సంస్థలతో కీలక ఒప్పందాలు..!
ఇందులో ఆస్ట్రేలియా విధానాన్ని ముఖ్యంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ప్రస్తుత సైబర్ భద్రతా చట్టాల్లో మార్పులు అవసరమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదింపులు జరిపి, వారి సేవలను దేశ చట్టాలకు అనుగుణంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల పిల్లల విద్య, ఆన్‌లైన్ అభ్యాసానికి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అయితే, డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు మరింత సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే ఏడాదిలోగా కొత్త నిబంధనలను తుదిరూపం ఇచ్చి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని పీఎస్‌ఎం న్యూస్ తెలిపింది.
Read Also : సీబీఎన్ అంటే బ్రాండ్.. మహానాడులో లోకేశ్ వ్యాఖ్యలు..
ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశాల్లో ఆస్ట్రేలియా తరువాత మాల్దీవులు నిలవనున్నాయి. ఆస్ట్రేలియా గత ఏడాది ఈ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశంలో నిబంధనలు అమలైన ప్రారంభ దశలోనే సుమారు 4.7 మిలియన్ల పిల్లల సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. నిబంధనలు పాటించని టెక్ కంపెనీలపై అక్కడి ఈ-సేఫ్టీ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న వేళ, మాల్దీవుల తాజా నిర్ణయం ఆ దిశలో మరో కీలక అడుగుగా మారుతోంది.
Read Also : బోత్ ఆర్ నాట్ సేమ్.. మహానాడు సభలో వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు..!


