హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన CURE–PURE–RARE వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. గత ఆరు నెలల్లో (ఆగస్టు 2025 – జనవరి 2026) రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగంలో ఏకంగా 2.73 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇందులో సింహభాగం హైదరాబాద్ చుట్టూ ఉన్న కోర్ అర్బన్ రీజియన్ (CURE) నుంచే రావడం విశేషం.
ఏ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు? (EPFO డేటా ప్రకారం):
CM Revanth Reddy Tourism Review: పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. కీలక ఆదేశాలు
ChatGPT Viral Post: చాట్ జీపీటీ నా జీవితాన్ని మార్చేసింది.. బెంగళూరు ఆటో డ్రైవర్ పోస్ట్‌పై ఓపెన్ ఏఐ రెస్పాన్స్!
Gmail Live Testing:సమయం లేనప్పుడు వాయిస్ అడిగితే చాలు.. ఈమెయిల్ లోని పూర్తి వివరాలను చదివి వినిపిస్తుంది!
మొత్తం 2.73 లక్షల ఉద్యోగాలలో, సుమారు 1.60 లక్షల ఉద్యోగాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతాల్లోనే లభించాయి.
టాప్ ఎంప్లాయ్‌మెంట్ హబ్స్:
- కూకట్‌పల్లి: 81,000 ఉద్యోగాలు (రాష్ట్రంలోనే ప్రథమ స్థానం)
- రంగారెడ్డి జిల్లా: 56,000 ఉద్యోగాలు
- బంజారాహిల్స్: 45,000 ఉద్యోగాలు
- సంగారెడ్డి: 42,000 ఉద్యోగాలు
- బర్కత్‌పురా: 34,000 ఉద్యోగాలు
హైదరాబాద్ వెలుపల కూడా ఉద్యోగ కల్పన నెమ్మదిగా పుంజుకుంటోంది. వరంగల్‌లో 6,800, నిజామాబాద్‌లో 4,200, మరియు కరీంనగర్‌లో 4,000 కొత్త ఉద్యోగాలు నమోదయ్యాయి.
ఏయే రంగాల్లో అభివృద్ధి?
తెలంగాణ యువత ఐటీ మరియు ఫార్మా రంగాలతో పాటు కొత్త తరం సాంకేతికతలపై పట్టు సాధిస్తుండటం ఈ వృద్ధికి ప్రధాన కారణం. ముఖ్యంగా:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & డీప్ లెర్నింగ్
- ఇండస్ట్రీ 4.0 (ఆధునిక తయారీ రంగం)
- ఐటీ మరియు ఐటీఈఎస్ (IT & ITeS)
- ఫార్మాస్యూటికల్స్
CURE–PURE–RARE వ్యూహం అంటే ఏమిటి?
- రాష్ట్ర అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, వికేంద్రీకరణ చేయడమే ఈ మోడల్ లక్ష్యం:
- CURE (Core Urban Region Economy): ORR లోపల ఉన్న ప్రాంతాల్లో ఐటీ, ఫైనాన్స్ మరియు సర్వీస్ సెక్టార్‌పై దృష్టి.
- PURE (Peri-Urban Region Economy): ORR మరియు రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ మరియు లాజిస్టిక్స్ హబ్స్ అభివృద్ధి.
- RARE (Regional Agricultural Region Economy): RRR వెలుపల ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు గ్రామీణ పారిశ్రామికీకరణ.
లక్ష్యం: $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ
ఈ అభివృద్ధి నమూనా ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2034 నాటికి $1 ట్రిలియన్ మరియు 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం పూర్తయితే, ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలకు మరింత వేగంగా విస్తరిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: