చెవిలో గులిమి పేరుకుపోయిందా? సురక్షితంగా తొలగించే పద్దతి ఇదే

చెవిలో ఉండే గులిమి చెవిని కాపాడే సహజ రక్షణ కవచం. పిన్నీసులు, కాటన్ బడ్స్‌తో చెవి శుభ్రం (Ear cleaning)చేయడం వినికిడి శక్తికి తీవ్ర హాని కలిగిస్తుంది. చెవి నొప్పి, వినికిడి తగ్గితే స్వయంగా ప్రయోగాలు చేయకుండా ENT డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

Ear-Cleaning
Ear-Cleaning

Ear cleaning

హైదరాబాద్: చాలా మందికి ఖాళీ సమయం దొరికితే చాలు. చేతికి పిన్నీసు దొరికినా, బండి తాళం చెవి దొరికినా వెంటనే చెవిలో పెట్టి తిప్పేస్తుంటారు. చెవిలో పేరుకుపోయిన ఆ పసుపు రంగు ‘గులిమి’ని తీసేస్తేనే చెవి శుభ్రం(Ear cleaning)గా ఉంటుందని మనలో చాలా మంది నమ్ముతారు. కానీ, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం చేసే ఈ చిన్న పని వినికిడి శక్తిని శాశ్వతంగా దూరం చేసే ప్రమాదం ఉంది. చెవి గులిమి అనేది మనం అనుకుంటున్నట్లు ఒక వ్యర్థ పదార్థం కాదు, అది మన చెవిని రక్షించే ఒక సహజ కవచం.

ముఖ్యమైన విషయాలు:

చెవి సహజ రక్షణ: శాస్త్రీయంగా ‘సెరుమెన్’ అని పిలిచే ఈ గులిమి, మన చెవి లోపలి భాగాన్ని తేమగా ఉంచుతుంది. ఇది బయటి నుండి వచ్చే దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మక్రిములు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దాన్ని శుభ్రం చేయకపోయినా, దవడ కదలికల ద్వారా అది ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేస్తుంది. గులిమి లేత పసుపు నుండి ముదురు గోధుమ రంగులో ఉండటం సహజమే. మీకు వినికిడి బాగుండి, నొప్పి లేకపోతే దాన్ని అస్సలు కదిలించకూడదు.

కాటన్ బడ్స్‌తో ప్రమాదం: మనం కాటన్ బడ్స్ వాడినప్పుడు అది గులిమిని బయటకు తీయడానికి బదులుగా, మరింత లోపలికి నెట్టేస్తుంది. దీనివల్ల కర్ణభేరి (Eardrum) మీద ఒత్తిడి పెరిగి అది పగిలిపోయే ప్రమాదం ఉంది. తరచూ బడ్స్ వాడటం వల్ల చెవిలో ఇన్‌ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇయర్‌ఫోన్లు, హియరింగ్ ఎయిడ్స్ ఎక్కువగా వాడే వారికి గులిమి బయటకు రాకుండా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

Ear-Cleaning
Ear-Cleaning

సమస్యను ఎలా గుర్తించాలి? ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి?: చెవి నిండుగా అనిపించడం, వినికిడి తగ్గడం, రింగింగ్ శబ్దాలు రావడం లేదా తీవ్రమైన నొప్పి ఉంటే అది గులిమి పేరుకుపోయినట్లు అర్థం. చెవి నుంచి దుర్వాసనతో కూడిన ద్రవం రావడం, జ్వరం ఉంటే అది ఇన్ఫెక్షన్‌గా గుర్తించాలి. ఇలాంటి సమయంలో ఇంట్లో ప్రయోగాలు చేయకుండా ENT డాక్టరును సంప్రదించాలి.

సురక్షితంగా క్లీన్ (Ear cleaning)చేయడం : గులిమి గట్టిపడితే సాఫ్టెనింగ్ డ్రాప్స్ లేదా ఆలివ్ ఆయిల్ వాడి దాన్ని మెత్తబరచాలి. రెండు మూడు రోజుల్లో అది సహజంగానే బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ సమస్య తగ్గకపోతే డాక్టర్లు ‘మైక్రోసక్షన్’ పద్ధతి ద్వారా సురక్షితంగా దాన్ని తొలగిస్తారు. చెవి చాలా సున్నితమైన అవయవం, కాబట్టి అనవసరమైన వస్తువులతో దాన్ని గాయపరచుకోకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »