Today Horoscope 28-03-2026: ఈ రాశుల వారికి కుజుడి అనుగ్రహం వల్ల..తోబుట్టువుల అండతో అన్నీ విజయాలే!

ఇవాళ 28 మార్చి 2026 శనివారం రాశి ఫలాలు తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి కుజుడి ప్రభావం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, ఉద్యోగ ఫలితాలు వివరంగా చదవండి.

today-horoscope-telugu-april-05-2026
today-horoscope-telugu-april-05-2026

హైదరాబాద్: ప్రస్తుత గ్రహ గతులను గమనిస్తే.. కుజుడి సానుకూల ప్రభావం, రాహు కేతువుల సంచారంలో వస్తున్న మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోదర స్థానంలో కుజుడు బలంగా ఉండటంతో, తోబుట్టువుల నుంచి ఊహించని రీతిలో పూర్తి సహకారం అందుతుంది. గతంలో పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోయి, ఆత్మీయుల మద్దతుతో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అయితే, ఇదే సమయంలో శని గ్రహ ప్రభావం వల్ల అనవసర వ్యయం పెరిగే సూచనలు ఉన్నాయి.. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

మేష రాశి:(Aries Today Horoscope)

ఇవాళ మీ సహనానికి కొన్ని పరీక్షలు ఎదురుకావచ్చు. పొదుపు చేయాలనే మీ నిర్ణయం ఫలిస్తుంది, కొంత ధనాన్ని ఆదా చేయగలుగుతారు. ఇంటి సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున, ఆవేశానికి లోనుకాకుండా విలువలకి ప్రాధాన్యతనిస్తూ సంయమనంతో నిర్ణయాలు తీసుకోండి.

వృషభ రాశి:(Taurus Today Horoscope)

సుదీర్ఘ కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. గతంలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల చక్కటి లాభాలుపొందుతారు. దీనివల్ల పొదుపు ప్రాముఖ్యతను గుర్తిస్తారు. పొరుగువారితో వాదనలకు దిగకండి. దూర ప్రయాణాలు కొంత శ్రమతో కూడుకున్నా, మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి.

మిథున రాశి:(Gemini Today Horoscope)

మీలో ఉన్న హాస్య చతురత చుట్టుపక్కల వారిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అవసరానికి తగినంత నగదు అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. బంధువుల నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది, వారు మీ బాధ్యతల్లో అండగా నిలుస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇవాళ కొంత మనస్తాపం కలిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:(Cancer Today Horoscope)

ఆపద సమయంలో ఇరుగుపొరుగు వారు మీకు తోడుగా నిలవడం ఎంతో ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పు ఇవాళ తిరిగి మీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప స్థాయిలో మనస్పర్థలు తలెత్తవచ్చు, జాగ్రత్త.

సింహ రాశి:(Leo Today Horoscope)

అనవసర గొడవలు, చర్చలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. డబ్బు విలువను ఇవాళ మీరు గుర్తిస్తారు. పాత వివాదాలను వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. గతంలో చేసిన అనవసర ఖర్చుల వల్ల, అత్యవసర సమయంలో డబ్బు అందక ఇబ్బంది పడతారు.

కన్యా రాశి:(Virgo Today Horoscope)

మీ కష్టార్జితాన్ని సరైన పథకాల్లో పెట్టుబడిగా పెట్టండి, తెలివిగా చేసే మదుపులు భవిష్యత్తులో గొప్ప లాభాలను ఇస్తాయి. ఇవాళ మీకు కుటుంబం ప్రాముఖ్యత బాగా అర్థమవుతుంది. జీవిత భాగస్వామి వల్ల చిన్నపాటి ఇబ్బంది లేదా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి చేసే ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి.

తులా రాశి:(Libra Today Horoscope)

మీ ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రేమ వ్యవహారాలకు ఇవాళ అంతగా కలిసిరాదు. వైవాహిక జీవితంలో చిన్నపాటి చికాకులు లేదా అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:(Scorpio Today Horoscope)

వ్యాపారులు, ట్రేడింగ్ రంగంలో ఉన్న వారికి ఇవాళ లాభసాటిగా ఉంటుంది, ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా మెయిల్స్ పూర్తి చేయడానికి ఇది అనుకూల సమయం. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి రావాల్సిన ముఖ్య సమాచారం కోసం వేచి చూడాల్సి రావచ్చు.

ధనుస్సు రాశి:(Sagittarius Today Horoscope)

శారీరక దృఢత్వం కోసం క్రీడలు లేదా వ్యాయామంపై మీరు ఆసక్తి చూపుతారు. తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది, దీనివల్ల మీ పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆఫీసులో మీ శ్రమకు బాస్ నుండి ప్రశంసలు పొందుతారు.

మకర రాశి:(Capricorn Today Horoscope)

ఇవాళ పాల్గొనే కార్యక్రమంలో మీరు కలిసే ఒక వ్యక్తి ఇచ్చే సలహా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో సరైన గైడెన్స్ లభిస్తుంది. అయితే, కారణం లేకుండా ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి:(Aquarius Today Horoscope)

మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా దానధర్మాలు మీకు అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆదాయం బాగానే ఉన్నా, దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

మీన రాశి:(Pisces Today Horoscope)

స్నేహితులతో కలిసి విహారయాత్రలు లేదా సామాజిక వేడుకలకు వెళ్తారు, ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. అయితే, గతంలో చేసిన అనవసర ఖర్చుల కారణంగా, ఇవాళ మీరు ఆశించినంత మొత్తాన్ని పొదుపు చేయలేకపోవచ్చు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »