మార్చి 1, 2026 ఆదివారం నాటి రాశిఫలాలు అన్ని 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. మేష రాశికి వాహన యోగం, ధనుస్సు రాశికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. మీ రోజు ఎలా సాగుతుందో ముందే తెలుసుకుని సన్నద్ధంగా ఉండండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక సమస్యలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెట్టడం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం హ్యాపీగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అధిక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. స్వల్ప ధనలాభ సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల కనిపిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలు సమస్యలు లేకుండా సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో అదనపు బాధ్యతలు పడతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చేయని పనికి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.