మీ ఇంట్లో ఈ రంగు ట్యాంక్ ఉందా? అయితే వెంటనే మార్చాల్సిందే!

వాటర్ ట్యాంక్ రంగు కేవలం అందం కోసం కాదు – అది నీటి ఉష్ణోగ్రత, నాణ్యత, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నల్లటి ట్యాంక్ నాచును అడ్డుకుంటే, తెల్లటి ట్యాంక్ నీటిని చల్లగా ఉంచుతుంది. మల్టీ-లేయర్ ట్యాంక్ అయితే వేడి + నాచు రెండింటికీ ఉత్తమ పరిష్కారం.

Black vs White Water Tank for Home Water Storage
Black vs White Water Tank for Home Water Storage

హైదరాబాద్: చలికాలం నెమ్మదిగా వీడ్కోలు పలుకుతోంది. ఎండలు మెల్లగా మొదలవుతున్నాయి. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ మన ఇంటి డాబా మీద ఉండే వాటర్ ట్యాంకులు నిప్పుల కుంపటిలా మారుతాయి. ఆ వేడికి ట్యాంకులోని నీళ్లు సెగలు గక్కుతుంటే.. స్నానం చేయాలన్నా, ఆ నీటిని వాడాలన్నా భయమేస్తుంటుంది. అంతేకాదు, ఎండ ప్రభావం వల్ల ట్యాంకులో నాచు (Algae) పేరుకుపోయి నీరు కలుషితం అవుతుంటుంది. అసలు వాటర్ ట్యాంక్ రంగు అనేది కేవలం చూడటానికి బాగుండటం కోసం మాత్రమే కాదు.. అది మన ఆరోగ్యాన్ని, నీటి నాణ్యతను కూడా నిర్ణయిస్తుంది. మరి తెల్లటి ట్యాంక్ మంచిదా? నల్లటి ట్యాంక్ మంచిదా? ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లటి ట్యాంక్ :

మన దేశంలో అత్యధికంగా వాడేవి నల్లటి ట్యాంకులే. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నలుపు రంగు సూర్యరశ్మిని (UV Rays) ట్యాంక్ లోపలికి వెళ్లనివ్వదు. సూర్యకాంతి లోపలికి వెళ్లకపోతే నీటిలో నాచు పెరగదు. దీనివల్ల నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. అయితే, దీనిలోని అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, నలుపు రంగు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఫలితంగా వేసవిలో ట్యాంకులోని నీరు విపరీతంగా వేడెక్కుతాయి. ఆ నీటితో స్నానం చేయడం లేదా పనులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది.

తెల్లటి ట్యాంక్ :

వైట్ ట్యాంకులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం (Reflect) చేస్తాయి. అంటే వేడిని లోపలికి పంపవు. దీనివల్ల ఎండకాలంలో కూడా నీరు చాలా చల్లగా ఉంటాయి. కానీ, ఇందులో ఒక సమస్య ఉంది. సాధారణ సింగిల్ లేయర్ తెల్లటి ట్యాంకుల ద్వారా సూర్యకాంతి లోపలికి ప్రసరిస్తుంది. ఇలా కాంతి సోకడం వల్ల ట్యాంక్ లోపల నాచు త్వరగా పేరుకుపోతుంది. అందుకే వైట్ ట్యాంక్ కొనేటప్పుడు అది కనీసం 3 లేదా 4 లేయర్లు కలిగి ఉండాలి. లోపల నల్లటి పొర ఉండి, పైన తెల్లటి రంగు ఉంటే వేడి తగ్గుతుంది, నాచు కూడా పట్టదు.

ఏది ఎంచుకోవాలి?

మీరు వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటే, నీళ్లు చల్లగా ఉండటం కోసం ‘మల్టీ-లేయర్ వైట్ ట్యాంక్’ తీసుకోవడం ఉత్తమం.

మీకు తక్కువ మెయింటెనెన్స్ కావాలి, నాచు పట్టకూడదు అనుకుంటే నల్లటి ట్యాంక్ సరిపోతుంది. కానీ వేసవిలో వేడి నీళ్ల సమస్యను భరించాల్సి ఉంటుంది.

ప్రస్తుత రోజుల్లో ‘థర్మల్ ఇన్సులేటెడ్’ ట్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఏ రంగులో ఉన్నా నీటిని చల్లగా ఉంచుతాయి. కాబట్టి కొనేటప్పుడు కేవలం రంగునే కాకుండా, అది ఎన్ని లేయర్లతో తయారైందో కూడా గమనించడం ముఖ్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: నల్లటి వాటర్ ట్యాంక్ ఆరోగ్యానికి హానికరమా?

A: కాదు. కానీ వేసవిలో నీరు ఎక్కువగా వేడెక్కడం వల్ల వాడకానికి ఇబ్బంది కలుగుతుంది.

Q2: తెల్లటి ట్యాంక్‌లో నాచు ఎందుకు త్వరగా పెరుగుతుంది?

A: సూర్యకాంతి లోపలికి వెళ్లడం వల్ల అల్గీ (Algae) వేగంగా పెరుగుతుంది.

Q3: బెస్ట్ ఆప్షన్ ఏది?

A: లోపల నలుపు పొర, బయట తెలుపు రంగు ఉన్న మల్టీ-లేయర్ ట్యాంక్ బెస్ట్ చాయిస్.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »