ఫ్రిజ్‌ను గోడకు దగ్గరగా పెడుతున్నారా? అయితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే

ఫ్రిజ్‌ను గోడ(Refrigirator close to wall )కు పూర్తిగా దగ్గరగా ఉంచడం వల్ల కంప్రెసర్ వేడెక్కి కూలింగ్ తగ్గడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. వెనుక భాగంలో కనీసం 4 అంగుళాల దూరం ఉంచితే గాలి సులభంగా ప్రవహించి ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Refrigerator close to wall effects – correct fridge placement tips in Telugu
Refrigerator close to wall effects – correct fridge placement tips in Telugu

Refrigirator close to wall

  • ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెట్టితే కంప్రెసర్ వేడెక్కి కూలింగ్ తగ్గుతుంది.

  • సరైన గాలి ప్రవాహం లేకపోతే ఫ్రిజ్ ఎక్కువగా పని చేసి కరెంట్ బిల్లు పెరుగుతుంది.

  • వెనుక భాగంలో కనీసం 4 అంగుళాల దూరం ఉంచితే ఫ్రిజ్ జీవితకాలం పెరుగుతుంది.

హైదరాబాద్: చాలా ఇళ్లలో స్థలం తక్కువగా ఉందని లేదా చూడటానికి బాగుంటుందని ఫ్రిజ్‌ను గోడ(Refrigirator close to wall)కు పూర్తిగా దగ్గరగా పెడుతుంటారు. మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారా? అయితే మీ ఫ్రిజ్ జీవితకాలం తగ్గిపోవడమే కాకుండా, కరెంట్ బిల్లు కూడా షాక్ ఇచ్చేలా వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ వేడెక్కి రిఫ్రిజిరేటర్ పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలన్నా, కూలింగ్ అద్భుతంగా రావాలన్నా గోడకు, ఫ్రిజ్‌కు మధ్య ఎంత దూరం ఉండాలి? ఎందుకు ఉండాలి? ఈ చిన్న చిట్కా మీ వేల రూపాయలను ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గోడకు ఫ్రిజ్‌కు మధ్య దూరం(Refrigirator close to wall) ఎందుకు ఉండాలి?
వేడి బయటకు : ఫ్రిజ్ లోపల చల్లగా ఉండటానికి, వెనుక ఉండే కంప్రెసర్, కాయిల్స్ నిరంతరం వేడిని బయటకు పంపుతుంటాయి. మీరు గోడకు ఆనించి పెడితే, ఆ వేడి బయటకు వెళ్లడానికి చోటు ఉండదు. ఫలితంగా కంప్రెసర్ వేడెక్కుతుంది (Overheat).

డబుల్ బిల్లు: వేడి బయటకు వెళ్లనప్పుడు, ఫ్రిజ్ లోపల చల్లదనాన్ని మెరుగుపరచడానికి మోటార్ రెండు రెట్లు కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ ఎక్కువగా ఖర్చవుతుంది, విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది.

Refrigirator close to wall
Refrigirator close to wall

కూలింగ్ తగ్గిపోతుంది: ఫ్రిజ్‌లో కూలింగ్ తగ్గగానే గ్యాస్ అయిపోయిందని చాలామంది అనుకుంటారు. కానీ అది గ్యాస్ సమస్య కాదు, ఫ్రిజ్ ఉంచిన విధానంలో ఉన్న లోపం మాత్రమే.

కంప్రెసర్ ఫెయిల్యూర్: కంప్రెసర్ నిరంతరం వేడెక్కడం వల్ల అది త్వరగా పాడైపోతుంది. దీన్ని రిపేర్ చేయించాలంటే వేల రూపాయల ఖర్చుతో కూడిన పని.

సరైన దూరం ఎంత?

ప్రముఖ కంపెనీల మాన్యువల్స్, నిపుణుల సూచన ప్రకారం, రిఫ్రిజిరేటర్ వెనుక భాగానికి, గోడకు మధ్య కనీసం 4 అంగుళాలు (10 సెంటీమీటర్లు) దూరం ఉండాలి. దీనివల్ల గాలి ఫ్రీగా ఆడి, మోటార్ నుండి వచ్చే వేడి సులభంగా బయటకు వెళ్లిపోతుంది.

ఫ్రిజ్ కొన్నప్పుడు వచ్చే ‘యూజర్ మాన్యువల్’ను ఒకసారి చదవండి. అందులో మీ మోడల్‌కు సంబంధించి ఎంత దూరం ఉండాలో స్పష్టంగా ఉంటుంది. కేవలం 4 అంగుళాల దూరం మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: ఫ్రిజ్‌ను గోడకు ఆనించి పెట్టితే ఏం జరుగుతుంది?

A: కంప్రెసర్ నుంచి వచ్చే వేడి బయటకు వెళ్లలేక ఫ్రిజ్ వేడెక్కి త్వరగా పాడైపోతుంది.

Q2: ఫ్రిజ్‌కు గోడకు మధ్య ఎంత దూరం తప్పనిసరి?

A: కనీసం 4 అంగుళాలు (సుమారు 10 సెంటీమీటర్లు) దూరం ఉంచాలి.

Q3: కూలింగ్ తగ్గితే తప్పనిసరిగా గ్యాస్ సమస్యేనా?

A: కాదు. చాలాసార్లు ఫ్రిజ్ ఉంచిన విధానంలో ఉన్న లోపం వల్లే కూలింగ్ తగ్గుతుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »