Horoscope: రియల్ ఎస్టేట్, సాంస్కృతిక రంగాల్లో భారీ లాభాలు.. ఈ రాశుల వారికి ఇవాళ పట్టిందల్లా బంగారమే!

నేటి రాశి ఫలాలు: మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారి జాతక స్థితిగతులు, గ్రహ సంచారం మరియు నిపుణులు సూచించిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

నవగ్రహాల సంచారం మరియు పన్నెండు రాశుల గుర్తులు సూచించే ఖగోళ చిత్రం.
today-horoscope-telugu

హైదరాబాద్: ప్రస్తుత ఖగోళ స్థితిగతులను పరిశీలిస్తే, నవగ్రహాల సంచారం పన్నెండు రాశులపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా అంగారకుడి (కుజుడు) ప్రభావం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది, అయితే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బుధ గ్రహ అనుకూలతతో వ్యాపార రంగంలో ఉన్నవారికి వాక్చాతుర్యం పెరిగి, ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయి. శని ప్రభావం కారణంగా చేపట్టే పనుల్లో కొంత ఆలస్యంజరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి తొందరపడకుండా సహనంతో వ్యవహరించాలి. గురు బలం తోడుగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా, పుణ్యక్షేత్ర సందర్శనలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

మేష రాశి: పాత బకాయిలు లేదా ఆగిపోయిన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. మీ స్నేహపూర్వక స్వభావం వల్ల సామాజిక గుర్తింపు లభిస్తుంది. వృత్తి రంగంలో వేగంగా పనులు పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు. దాంపత్య జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది.

వృషభ రాశి: ఇవాళ మీలో శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉంటాయి. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండటంతో పొదుపు చేయడం కష్టమవుతుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కోసం ‘ఓం నమో భగవతే రుద్రాయ’ మంత్రాన్ని 11 సార్లు పఠించడం శుభప్రదం.

మిథున రాశి: శారీరకంగా, మానసికగా చాలా నీరసంగా అనిపించవచ్చు. ఆర్థిక లావాదేవీలు లేదా పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. నూతన వ్యాపార ఆలోచనలు లాభసాటిగా మారుతాయి. పాత మిత్రులతో గడిపే సమయం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది.

కర్కాటక రాశి: రోజును ధ్యానం లేదా యోగాతో ప్రారంభించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత విషయాలను లేదా రహస్యాలను ఇతరులతో పంచుకోకండి.

సింహ రాశి: ఇవాళ ఆత్మవిశ్వాసంతో కఠినమైన సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించకుండా అప్పులు ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, సంయమనం పాటించండి మంచిది.

కన్యా రాశి: స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్) లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. తప్పుడు వార్తల వల్ల మీరు మనస్తాపానికి గురయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక పుస్తక పఠనం లేదా గురువుల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

తులా రాశి: ఇవాళ దైవచింతనతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గతంలో ఆగిపోయిన పథకాలు లేదా ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై లాభాలను చేకూరుస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి కలహాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది.

వృశ్చిక రాశి: విచ్చలవిడి ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ కోపం, మాట తీరు వల్ల ఇంట్లో వారు బాధపడే అవకాశం ఉంది.” మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే కృషికి తగిన ఫలితాలు అందుతాయి.

ధనుస్సు రాశి: భూమికి సంబంధించిన క్రయవిక్రయాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదంటే మీ మాటలు కుటుంబంలో అశాంతిని కలిగించవచ్చు. ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా, రామ స్తుతి పఠించడం ఉత్తమం.

మకర రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత అసహనాన్ని కలిగించవచ్చు. మీ పిల్లలు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వాన్ని ఇస్తాయి, వారి వల్ల మీకు ధన లాభం కూడా కలగవచ్చు. అనవసర వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీ విలువైన కాలాన్ని వృథా చేయకండి.

కుంభ రాశి: పని ఒత్తిడితో అలసిపోయినట్లు ఉంటుంది. ఖర్చులు, పొదుపు విషయంలో అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇంట్లో పండుగ సందడి నెలకొంటుంది. ఏదైనా మంచి పని లేదా ఫంక్షన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మీన రాశి: మనశ్శాంతి కోసం, మానసిక ధైర్యం కోసం యోగా, ధ్యానం (మెడిటేషన్) చేయండి. ఆదాయం పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరగకుండా జాగ్రత్త పడండి. ఎగ్జిబిషన్లు లేదా సెమినార్లలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఇవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »