Today rasi phalalu in telugu 2026: ఈ రాశుల వారి టెన్షన్లకు శుభం కార్డు పడ్డట్టే..

2026 మార్చి 22 ఆదివారం రాశిఫలాలు తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబ విషయాలపై పూర్తి వివరాలు.

today-horoscope-telugu-april-05-2026
today-horoscope-telugu-april-05-2026

హైదరాబాద్: ప్రస్తుత గ్రహ గతుల ప్రకారం, చాలా రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం వరించనుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు అందడమే కాకుండా, రావలసిన బాకీలు వసూలై ఆర్థిక కష్టాలు తీరుతాయి. అయితే, కుటుంబంలో చిన్నపాటి వాదనలు జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం.

మేష రాశి: ఇవాళ మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని అప్పు అడిగేవారిని సున్నితంగా తిరస్కరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తోటివారితో గొడవలకు పోకుండా, సమస్యలను శాంతంగా పరిష్కరించుకోండి.

వృషభ రాశి: కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధనాన్ని ఎలా పొదుపు చేయాలో ఇవాళ మీకు ఒక స్పష్టత వస్తుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మిథున రాశి: పిల్లల పట్ల కఠినత్వం వద్దు, అది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తండ్రి ఇచ్చే సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి. తమ్ముడితో కలిసి బయటకు వెళ్లడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది.

కర్కాటక రాశి: ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోండి, అది మీకు విజయాన్ని అందిస్తుంది. ఇవాళ సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది, కాబట్టి పనులను ప్లాన్ ప్రకారం పూర్తి చేయండి.

సింహ రాశి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. దీనివల్ల సమస్యలు తక్షణమే తీరుతాయి. ఇంటి మార్పుల విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకోండి. వాస్తవాలను గ్రహించకపోతే బంధువులతో మనస్పర్థలు రావచ్చు. భాగస్వామి ఆరోగ్యం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు.

కన్యా రాశి: గత కొంతకాలంగా ఉన్న టెన్షన్ల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపార అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైన సమయంలో సన్నిహితుల నుండి ఆర్థిక సాయం అందుతుంది. ఒక తీపి కబురు వినడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

తులా రాశి: మీ మేధస్సుతో పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణకు సన్నిహితుల నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి వచ్చే మంచి వార్త కోసం కొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి: మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోండి. గతంలో మీరు ఇచ్చిన అప్పులు ఇవాళ తిరిగి వస్తాయి. ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే, వ్యాపారస్తులు తమ భవిష్యత్తు ప్రణాళికలను ఒకసారి పునఃసమీక్షించుకోవడం మంచిది.

ధనుస్సు రాశి: ఇంట్లోని పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కొత్త ఆర్థిక అవకాశాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. మీ ఫ్యూచర్ ప్లాన్లను సరిచూసుకోవడానికి ఇది సరైన సమయం. కష్టాల్లో తోడుండే మిత్రుని వల్ల ఇవాళ మీరు చాలా సంతోషిస్తారు.

మకర రాశి: దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ప్రయాణం చేస్తే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. పాత స్నేహితుడిని కలవడం చాలా సంతోషాన్నిస్తుంది.

కుంభ రాశి: చాలా కాలంగా ఆగిపోయిన పనులను మీరే ముందుండి పూర్తి చేస్తారు.పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి, మీ సంపాదన పెరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులపై అధికారం చెలాయించాలని చూస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీన రాశి: జీవిత భాగస్వామితో కలిసి ఇంటి కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు, దీనివల్ల కొంత ఆర్థిక భారం పడవచ్చు. ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగుపడటానికి శివలింగానికి అభిషేకం చేయడం మంచిది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »