హైదరాబాద్: ప్రస్తుత గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను, మరికొందరికి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వృత్తిలో వచ్చే మార్పుల వల్ల ఆకస్మిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
వ్యాపారస్తులకు మార్కెట్ పరిస్థితులు అనుకూలించి లాభాలు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి లేదా రెజ్యూమ్ పంపడానికి ఇది సరైన సమయం. అయితే, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.
మేష రాశి: వీరు అధిక శక్తి సామర్థ్యాలతో కనిపిస్తారు. కుటుంబ , ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు వేసే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. వృత్తిపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది, ఆఫీసులో జరిగే మార్పులు మీకు మేలు చేస్తాయి.
వృషభ రాశి: వ్యక్తిగత పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు మీ ఆలోచనా విధానంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వారు తమ భాగస్వాముల వ్యవహారశైలిని గమనిస్తూ ఉండాలి, వారి వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మిథున రాశి: ఇవాళ మీకు సన్నిహితులు , భాగస్వామి నుంచి పూర్తి సహకారం అందుతుంది. అయితే, ఇంట్లో జరిగే శుభకార్యాల వల్ల లేదా ఇతర కార్యక్రమాల వల్ల మీ బడ్జెట్ దాటి ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో మీ పనితీరుకు, అందరితో కలిసిపోయే గుణానికి మేనేజ్‌మెంట్ నుంచి ప్రశంసలు అందుతాయి.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల ఆత్మీయత మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తిపరంగా మీరు చేసిన కృషికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమే అయినప్పటికీ, గుడ్డిగా వెళ్లకుండా అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. సహోద్యోగుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సింహ రాశి: వ్యాపారవేత్తలకు అదృష్టం వరిస్తుంది. అనుకోని రీతిలో లాభాలు రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అయితే, ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి: కన్యా రాశి వారికి అన్ని రంగాల్లోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా అందే ఒక శుభవార్త మీ కుటుంబంలో పండగ వాతావరణాన్ని నింపుతుంది. ఆఫీసులో పై అధికారులు , సహోద్యోగుల సహకారంతో పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి.
తులా రాశి: ఇవాళ ఆర్థికంగా అంత లాభసాటిగా ఉండకపోవచ్చు, అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సామాజికంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా, మీలోని ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వ్యక్తిత్వ వికాసం వైపు నడిపిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది, లేదంటే మనస్పర్థలు రావచ్చు.
వృశ్చిక రాశి: ఆర్థికంగా మీకు అద్భుతమైన రోజు. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు మీ ముందుకు వస్తాయి, ఇవి భవిష్యత్తులో మీ హోదాను పెంచుతాయి. మనశ్శాంతి కోసం దైవ ప్రార్థనలు లేదా ఆధ్యాత్మిక పనుల్లో గడుపుతారు. అయితే, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం.
ధనుస్సు రాశి: ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా బంగారు ఆభరణాలు కొనే అవకాశం ఉంది. ఆఫీసులో మీ శత్రువులుగా భావించే వారు కూడా అనుకూలంగా మారడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఖాళీ సమయాన్ని సృజనాత్మక పనుల కోసం కేటాయిస్తారు.
మకర రాశి: వ్యాపారస్తులకు ఇది ఒక గోల్డెన్ డే అని చెప్పవచ్చు. ఊహించని విధంగా వచ్చే లాభాలు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు లేదా వారిలోని ప్రతిభ మీకు ఎంతో గర్వకారణంగా మారుతుంది. ఆర్థికంగా ఎదగడానికి గ్రహ గమనం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది.
కుంభ రాశి: ఉద్యోగ లేదా వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవసరమైన సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. నిత్యం ధ్యానం, యోగా చేయడం వల్ల మీ మానసిక స్థితి మరింత దృఢంగా మారుతుంది.
మీన రాశి: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. వృత్తిపరంగా కొన్ని సానుకూల మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చుల వల్ల పొదుపు చేయడం సవాలుగా మారుతుంది. ఆఫీసులో సహోద్యోగుల నుంచి ఏదైనా బహుమతి లేదా మంచి వార్త అందుకునే అవకాశం ఉంది.


