Today Horoscope in Telugu: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది.. తెలియని మార్గాల్లో ధన ప్రాప్తి..

ఇవాళ 29 మార్చి 2026 రాశి ఫలాలు తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి కుజుడి ప్రభావం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, ఉద్యోగ ఫలితాలు వివరంగా చదవండి.

Today Horoscope in Telugu
Today Horoscope in Telugu

Today Horoscope in Telugu: హైదరాబాద్: ప్రస్తుత గ్రహాల స్థితిగతులు అన్ని రాశుల వారిపై భిన్నమైన ప్రభావాలను చూపుతున్నాయి. ప్రధానంగా కుజుడి సంచారం వల్ల కోపావేశాలు పెరిగే అవకాశం ఉంది. మాటల్లో కరుకుదనం పెరగడం వల్ల ఆత్మీయులు లేదా స్నేహితులతో గొడవలు రావచ్చు, కాబట్టి సంభాషణలో సంయమనం పాటించడం ముఖ్యం.

ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గ్రహ మార్పుల వల్ల ధనం విపరీతంగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

మేష రాశి: మీ ప్రవర్తన లేదా కఠినమైన మాటల వల్ల మిత్రులకు బాధ కలగవచ్చు. గతంలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లు ఇప్పుడు మంచి లాభాలనిస్తాయి. పొదుపు ప్రాముఖ్యతను ఇవాళ గుర్తిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంటి వాతావరణం కొంత అస్థిరంగా ఉండవచ్చు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఆ రంగంలో అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

వృషభ రాశి: బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ధన లాభ సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా కలవని పాత స్నేహితులు లేదా బంధువులను కలిసే అవకాశం ఉంది. మీ మొండితనాన్ని వీడి, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

మిథున రాశి: మానసిక , శారీరక దృఢత్వం కోసం యోగా, ధ్యానం వంటివి పాటించండి. సంపాదన బాగున్నప్పటికీ, అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. సన్నిహితులతో చిన్నపాటి పార్టీలు లేదా వేడుకల్లో పాల్గొంటారు. సంబంధాలు పటిష్టం కావడానికి విష్ణుమూర్తి మత్స్యవతార కథను పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆరోగ్య సమస్యల వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు. ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సామాజిక కార్యక్రమాల్లో పాల్డొనడం వల్ల సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సింహ రాశి: ఉదయం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, సాయంత్రానికి లాభాలు పొందుతారు. సమయానికి స్నేహితుల మద్దతు లభించకపోవడం వల్ల కొంత నిరాశ చెందుతారు. కొత్త విషయాల పట్ల సృజనాత్మకంగా ఆలోచిస్తారు. వైవాహిక బంధంలో ఆహ్లాదకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

కన్యా రాశి: ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయండి. విదేశాల్లో లేదా వేరే ప్రాంతాల్లో మీరు పెట్టిన పెట్టుబడులు ఇవాళ మంచి లాభాలకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. ఇష్టమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఇంట్లోని పెద్దల అనుభవాలను విని, జీవితంలోని మెళకువలను నేర్చుకుంటారు.

తులా రాశి: ఈ రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. సొంత కృషితో ధనాన్ని ఆర్జిస్తారు. మీ తెలివితేటలు, చమత్కారమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు కొంచెం కష్టమనిపించినా, మీ భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఈ ప్రయాణాల వల్ల ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఇతరులకు సహాయం చేస్తారు. దీని వల్ల మీరు ప్రశంసలు అందుకుంటారు. అనుకోని విధంగా చేతికి డబ్బు అందుతుంది, దీనివల్ల పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి ఒక మధురమైన కానుక లేదా సర్‌ప్రైజ్ అందుకునే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: మీ కఠినమైన మాటలు మీ ప్రియమైన వారిని బాధపెట్టవచ్చు, కాబట్టి నిగ్రహంగా ఉండండి. ఊహించని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది, ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలను లేదా నమ్మకమైన రహస్యాలను ఇతరులకు చెప్పకండి. అది ఇబ్బందులకు దారితీయవచ్చు.

మకర రాశి: గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా ఇవాళ లాభాలు పొందుతారు. భవిష్యత్తుకు పొదుపు ఎంత అవసరమో ఇవాళ మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కుటుంబంలో చిన్నపాటి చికాకులు ఉండవచ్చు. బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక బాధ్యతలను నెరవేర్చి గౌరవం పొందుతారు. వైవాహిక జీవితంలో స్వల్ప విభేదాలు రావచ్చు.

కుంభ రాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. ధన సంబంధిత చిక్కుల నుండి బయటపడతారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో హోమాలు లేదా శాస్త్రోక్తమైన పూజా కార్యక్రమాలు నిర్వహించే సూచనలు ఉన్నాయి. శుభ ఫలితాల కోసం ఉదయం, సాయంత్రం 11 సార్లు “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని జపించండి.

మీన రాశి: యోగా లేదా ధ్యానంతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, పాత అప్పుల నుండి విముక్తి పొందుతారు. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. మీ పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది, అయితే అది మీకు అంతగా నచ్చకపోవచ్చు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »