Today Horoscope Telugu: ఈ రాశుల వారు చేసే కొత్త బిజినెస్ డీల్స్.. వీటి వలన భవిష్యత్తులో అద్భుత విజయాలే!

Today Horoscope Telugu: మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంది? ఎవరికి ధనలాభం, ఎవరికి ఒత్తిడి? పూర్తి వివరాలు మీ కోసం.

Today Horoscope Telugu
Today Horoscope Telugu

Today Horoscope Telugu:

హైదరాబాద్: ఇవాళ గ్రహ(Horoscope)సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కాబట్టి ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించడం అవసరం. పాత పెట్టుబడుల ద్వారా లేదా పిల్లల వల్ల ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇతరులకు భారీగా అప్పులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో చిక్కులు ఎదురవ్వచ్చు. ఆఫీసులో పై అధికారుల మెప్పు, సహోద్యోగుల మద్దతు లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఒప్పందాల విషయంలో భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా స్థిరంగా ఉండాలి.

మేష రాశి: ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు. అత్యంత సన్నిహితులతో వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, ఇవి కోర్టు కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు సంపాదించిన సొమ్ము వృధా కావచ్చు. అయితే, వృత్తిపరంగా పై అధికారుల నుండి, తోటి వారి నుండి పూర్తి సహకారం, ప్రశంసలు అందుతాయి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

వృషభ రాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి సంయమనం పాటించండి. పెద్ద వ్యాపార డీల్స్ కుదుర్చుకునేటప్పుడు ఎమోషన్స్ కి లోనుకాకుండా ఉండండి. గొడవల వల్ల మీ బంధాలు పాడవకుండా ఉండాలంటే.. కొంచెం ఓపికగా ఉండటం చాలా ముఖ్యం.

మిథున రాశి: అనారోగ్యం కారణంగా ఒక ముఖ్యమైన పని ఆగిపోయే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ, మీ మనోబలంతో పట్టుదలగా ముందుకు సాగండి. ఇవాళ ఎవరికీ అప్పులు ఇవ్వకండి, అది మీ భవిష్యత్తు(Horoscope)పై ప్రభావం చూపవచ్చు. కష్ట సమయాల్లో మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి: ఖర్చులను నియంత్రించుకోవడం ఇవాళ చాలా అవసరం. కార్యాలయంలో సహోద్యోగుల, అధికారుల సహకారంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో జరిగిన పొరపాట్ల గురించి బాధపడుతూ (Self-pity) సమయాన్ని వృధా చేయకండి. అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు వైపు అడుగులు వేయండి.

సింహ రాశి: డబ్బుకు సంబంధించిన సమస్యలు కొంత కలవరపెట్టవచ్చు. అజాగ్రత్త లేదా మితిమీరిన ఖర్చుల వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఇవాళ మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి, వారి మాటలను గౌరవించడం వల్ల మేలు జరుగుతుంది.

కన్యా రాశి: ఇవాళ మీరు కొంచెం భావోద్వేగంగా ఉంటారు, కాబట్టి మనసును కష్టపెట్టే విషయాలకు దూరంగా ఉండండి. మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. గతంలో మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. అదృష్టం మీ వైపు ఉంది. ఉమ్మడి వ్యాపారాలు (Partnerships) సత్ఫలితాలను ఇస్తాయి, అయితే భాగస్వాములతో కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు.

తులా రాశి: స్నేహితులు ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అడిగే అవకాశం ఉంది. ఇచ్చే ముందు మీ ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకోండి, లేదంటే ఇబ్బందుల్లో పడతారు. దాంపత్య జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ కుతూహలం భవిష్యత్తు(horoscope)లో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది.

వృశ్చిక రాశి: ఇవాళ మీరు చేసే షాపింగ్ లేదా పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఇవాళ అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు మీరు నమ్మే వ్యక్తుల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి.

ధనుస్సు రాశి: త్వరగా డబ్బు సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనువైన సమయం. ఆఫీసు వాతావరణం మీకు సానుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడని వారితో కూడా మర్యాదగా ఉంటే అది మీకు మేలు చేస్తుంది. మీ సృజనాత్మకత మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది.

మకర రాశి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొత్త ఆదాయ మార్గాల ద్వారా మీకు ధన లాభం కలుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సుదీర్ఘ కాలంగా ఆగిపోయిన ప్రాజెక్టులు, పథకాలు వేగవంతమై పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి: గ్రహ స్థితి (horoscope)అంత అనుకూలంగా లేనందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. కార్యాలయంలో మీ పనితీరుకు బాస్ నుండి ప్రశంసలు అందుతాయి. వాయిదా పడుతున్న పనులను ఇవాళ పూర్తి చేసే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన వ్యక్తులతో గడపడం వల్ల మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి సలహాలు పొందుతారు.

మీన రాశి: చాలా కాలంగా వేధిస్తున్న ఒత్తిడి, అలసట నుండి ఇవాళ విముక్తి లభిస్తుంది. పిల్లల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది, ఇది మీకు సంతోషాన్నిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. సామాజిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »