వేడి నీటితో పాదాల నొప్పికి చెక్ పెట్టాలనుకుంటున్నారా? వీరికి యమ డేంజర్.. జాగ్రత్త!

పాదాల నొప్పి(Foot Bath Side Effects) నుంచి ఉపశమనం కోసం గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం సాధారణ చిట్కా. కానీ మధుమేహం, రక్త ప్రసరణ లోపాలు, చర్మ వ్యాధులు, గర్భధారణ లేదా హై బీపీ ఉన్నవారు ఈ ఫుట్ బాత్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిట్కా పాటించే ముందు ఆరోగ్య పరిస్థితిని గమనించడం చాలా ముఖ్యం.

Foot Bath Side Effects: Who Should Avoid Warm Water Foot Soak
Foot Bath Side Effects: Who Should Avoid Warm Water Foot Soak

Foot Bath

  • గోరువెచ్చని నీటిలో పాదాల(Foot Bath Side Effects)ను నానబెట్టడం రక్త ప్రసరణను మెరుగుపరచి కండరాల నొప్పికి తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది.

  • మధుమేహం, రక్త ప్రసరణ సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారికి ఫుట్ సోక్ ప్రమాదకరంగా మారవచ్చు.

  • ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే ఫుట్ బాత్ చేయాలి; సందేహం ఉంటే డాక్టర్ సలహా తప్పనిసరి.

హైదరాబాద్: నేటి వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, ఎక్కువ సేపు కదలకుండా ఉండటం లేదా నిరంతర ప్రయాణాల కారణంగా చాలామంది పాదాల నొప్పితో(Foot Bath Side Effects) ఇబ్బంది పడుతుంటారు. ఈ నొప్పి నుండి తక్షణ ఉపశమనం కోసం తరతరాలుగా వస్తున్న ఒక ప్రసిద్ధ ఇంటి చిట్కా ఏమిటంటే.. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి, అందులో పాదాలను ఒక 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టడం. దీనినే ‘ఫుట్ సోక్’ (Foot Soak) అని కూడా అంటారు. సాధారణంగా ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. అయితే, ఈ పద్ధతి అందరికీ మేలు చేయదని, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దూరంగా ఉండాల్సింది వీరే:

1. మధుమేహ వ్యాధిగ్రస్తులు: షుగర్ వ్యాధితో బాధపడేవారిలో ‘న్యూరోపతి’ అనే సమస్య వల్ల పాదాల్లో నరాల స్పర్శ తగ్గుతుంది. దీనివల్ల నీరు ఎంత వేడిగా ఉందో వారి మెదడు సరిగ్గా గుర్తించలేదు. ఇలాంటి స్థితిలో నీరు మరీ వేడిగా ఉన్నా తెలియక పాదాలను అందులోనే ఉంచడం వల్ల తీవ్రమైన కాలిన గాయాలు లేదా బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి త్వరగా తగ్గవు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

Foot Bath
Foot Bath

2. రక్త ప్రసరణ సమస్యలు: పాదాలకు లేదా కాళ్లకు రక్త ప్రసరణ సరిగా లేని వ్యక్తులు వేడి నీటిని వాడకూడదు. రక్త ప్రవాహంలో ఆకస్మికంగా వచ్చే మార్పులు నొప్పిని, వాపును తగ్గించకపోగా మరింత పెంచుతాయి. అంతేకాకుండా, వేడి నీరు సున్నితమైన చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

3. చర్మ వ్యాధులు, గాయాలు: చర్మంపై ఎగ్జిమా, సోరియాసిస్ లేదా ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు వేడి నీటిలో పాదాలు ఉంచడం వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. వేడి నీరు చర్మాన్ని పొడిగా మార్చడం లేదా ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. పాదాలపై చిన్న చిన్న పుండ్లు లేదా గాయాలు ఉన్నప్పుడు కూడా వేడి నీటి స్నానాలు మానుకోవాలి.

4. గర్భిణీలు, హై బీపీ బాధితులు: గర్భవతులు పాదాలను వేడి నీటిలో నానబెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్తపోటుపై ప్రభావం పడుతుంది. ఇది తల్లికి, బిడ్డకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, అధిక రక్తపోటు ఉన్నవారికి వేడి నీటి వల్ల హృదయ స్పందన రేటులో మార్పులు రావచ్చు. ఇది గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.

పాదాల నొప్పిని తగ్గించుకోవడానికి వేడి నీటి చిట్కా మంచిదే అయినప్పటికీ, పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పద్ధతికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఏదైనా చిట్కాను పాటించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడం లేదా డాక్టరును సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: రోజూ ఫుట్ సోక్ చేయవచ్చా?

A: ఆరోగ్య సమస్యలు లేనివారు వారానికి 2–3 సార్లు చేయవచ్చు. రోజూ చేయడం అవసరం లేదు.

Q2: షుగర్ ఉన్నవారు ఫుట్ బాత్ చేయవచ్చా?

A: వద్దు. షుగర్ ఉన్నవారికి పాదాల స్పర్శ తగ్గి కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ.

Q3: ఫుట్ సోక్ ఎంత సేపు చేయాలి?

A: సాధారణంగా 15–20 నిమిషాలు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ చేయడం మంచిది కాదు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »