voter list 2026 : వోటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? కొత్త పార్ట్, సీరియల్ నంబర్ ఇలా తెలుసుకోండి

voter list 2026: SIR-2026 ముసాయిదా వోటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? EPIC నంబర్‌తో కొత్త పార్ట్, సీరియల్ నంబర్ తెలుసుకునే విధానం, కొత్త ఓటర్ల నమోదు వివరాలు తెలుసుకోండి.

voter-list-2026-epic-number-part-serial-number-check
voter-list-2026-epic-number-part-serial-number-check

voter list 2026: మీ ఓటు ఉందా? వోటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఉంటే ప్రస్తుతం మీ పేరు ఏ పార్ట్‌లో ఉంది? మీ సీరియల్ నంబర్ ఎంత? ఈ వివరాలు ఇప్పుడు ప్రతి ఓటర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే SIR-2026లో భాగంగా ముసాయిదా వోటర్ జాబితా విడుదలైన తర్వాత చాలా మంది ఓటర్ల పార్ట్ నంబర్లు, సీరియల్ నంబర్లు మారిపోయాయి.

అందుకే పాత వోటర్ స్లిప్ లేదా ఎన్యూమరేషన్ ఫామ్‌లో ఉన్న పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ ఆధారంగా కొత్త జాబితాలో పేరు వెతికితే కనిపించకపోవచ్చు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఉంది.

EPIC నంబర్‌తో కొత్త వివరాలు తెలుసుకోవచ్చు

SIR-2026లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా వోటర్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వోటర్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని అందులో పేరు వెతకాల్సి ఉంటుంది.

అయితే పేరు లేదా EPIC నంబర్‌తో నేరుగా PDFలో సెర్చ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామందికి తమ పేరును గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫామ్‌లో ఉన్న పాత పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ కూడా చాలా మందికి మారిపోయాయి.

 SMS ద్వారా కొత్త పార్ట్ నంబర్ తెలుసుకోండి

మీ EPIC నంబర్ అంటే వోటర్ ID నంబర్ మీ దగ్గర ఉంటే చాలు. కేంద్ర ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబర్ 1950 కు SMS ద్వారా మీ EPIC నంబర్‌ను పంపొచ్చు.

SMSను ECI EPIC నంబర్  అనే ఫార్మాట్‌లో పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ EPIC నంబర్‌కు సంబంధించిన వివరాలు అందుతాయి.

అందులో పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, నియోజకవర్గం, నియోజకవర్గం నంబర్, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 

కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్  Voters.ECI.gov.in లోకి వెళ్లాలి. అక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కేంద్రం వోటర్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మీకు వచ్చిన కొత్త పార్ట్ నంబర్ ఆధారంగా సంబంధిత పోలింగ్ కేంద్రం జాబితాను గుర్తించాలి. ఆ PDFను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన సీరియల్ నంబర్ ఆధారంగా జాబితాలో మీ పేరు ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు.

అంటే ముందుగా మీ EPIC నంబర్‌ను 1950కు SMS చేయాలి. కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి సంబంధిత పోలింగ్ స్టేషన్ PDFను డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

పాత నంబర్ మారిందని ఆందోళన వద్దు

పాత వోటర్ స్లిప్‌లో ఉన్న పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ ఆధారంగా కొత్త జాబితాలో పేరు కనిపించలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. SIR-2026 ముసాయిదా వోటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా ఒక్కసారి చెక్ చేసుకోవాలి.

మీ EPIC నంబర్‌ను దగ్గర పెట్టుకుని కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలుసుకుని, మీ పోలింగ్ కేంద్రం జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవడం మంచిది. ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పుడే వోటర్ జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం ఉత్తమం.

కొత్త ఓటర్లకు కూడా అవకాశం

వోటర్ జాబితాలో ఇప్పటి వరకు పేరు లేకపోవడం లేదా ఎన్యూమరేషన్ ఫామ్ దాఖలు చేయకపోవడం వల్ల ముసాయిదా జాబితాలో చోటు పొందని వారికి కూడా ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి EROలు నోటీసులు జారీ చేసి  అక్టోబర్ 15లోగా విచారణ పూర్తి చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అక్టోబర్ 19న ప్రకటించే తుది SIR వోటర్ జాబితాలో చోటు కల్పిస్తారు.

కాబట్టి మీ ఓటు హక్కు విషయంలో చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా.. ఇప్పుడే వోటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »