మీ పెరట్లో చెన్నంగి మొక్క ఉందా? అయితే ఈ ఆరోగ్య సమస్యలన్ని పరార్!

చెన్నంగి (కసివింద-Kasivinda Leaves) మొక్క ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఔషధ మొక్క. చర్మ వ్యాధులు, మూత్ర సమస్యలు, వాపులు, బోదకాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను సహజంగా నయం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. సరైన మోతాదులో వాడితే ఇది సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

Amazing Medicinal Benefits of Kasivinda (Chennangi) Leaves for Natural Healing
Amazing Medicinal Benefits of Kasivinda (Chennangi) Leaves for Natural Healing

Kasivinda Leaves

  • చెన్నంగి (కసివింద-Kasivinda Leaves) ఆకులు, వేరు, గింజలు ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ప్రభావవంతమైన ఔషధాలుగా ఉపయోగిస్తారు.

  • మూత్ర సమస్యలు, బోదకాలు, చర్మ వ్యాధులు, వాపులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఈ మొక్క సహజ చికిత్సను అందిస్తుంది.

  • అత్యవసర పరిస్థితుల్లో గాయాల రక్తస్రావం ఆపడం, పాము కాటు విష ప్రభావం తగ్గించడంలో కూడా చెన్నంగి ఉపయోగపడుతుంది.

హైదరాబాద్: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధ గనుల్లో ఆకుకూరలు, మూలికలు ప్రధానమైనవి. అలాంటి కోవకు చెందినదే చెన్నంగి(కసివింద-Kasivinda Leaves) మొక్క. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ మొక్కను కేవలం కలుపు మొక్కగా చూడకూడదు, ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఇందులో అపారమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలోనూ, మొండి వ్యాధులను నయం చేయడంలోనూ చెన్నంగి మొక్క అమోఘంగా పనిచేస్తుంది.

ఆరోగ్య (Kasivinda Leaves)ప్రయోజనాలు :

Kasivinda Leaves
Kasivinda Leaves

చర్మ వ్యాధులు, పక్షవాతం:
చెన్నంగి (Kasivinda Leaves)ఆకుల్లో వాతాన్ని, విషాన్ని హరించే అద్భుత శక్తి ఉంది. ఈ ఆకులను వెన్నతో కలిపి నూరి, పక్షవాతం వల్ల పనిచేయని భాగాలపై ప్రతిరోజూ మర్దనా చేస్తే క్రమంగా కదలికలు మొదలవుతాయి. అలాగే, ఆకులు,వేరు బెరడు పొడిని తేనెతో కలిపి లేపనంగా రాస్తే మొండి వ్రణాలు, చర్మ వ్యాధులు, గాయాలు త్వరగా నయమవుతాయి.

మూత్ర సంబంధిత సమస్యలు:
సమస్త మూత్ర వ్యాధులకు చెన్నంగి గింజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఈ గింజలను దోరగా వేయించి చేసిన పొడితో కషాయం కాచి, అందులో పాలు, పటిక బెల్లం కలిపి తాగితే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్లు తగ్గి రక్తం శుద్ధి అవుతుంది. అతిమూత్ర వ్యాధితో బాధపడేవారు ఈ పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బోదకాలు:
శరీరంలో చేరిన చెడు నీటిని బయటకు పంపడంలో చెన్నంగి వేరు బెరడు పొడికి మించినది లేదు. ఈ పొడిని ఆవు పాలతో కలిపి తీసుకుంటే బోదకాలు తగ్గు ముఖం పడుతుంది. శరీరమంతా వాపులు వచ్చే ఉబ్బు రోగానికి, ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు నీరు బయటకు పోయి వాపులు తగ్గుతాయి. (గమనిక: దీనివల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉన్నందున మొదట తక్కువ మోతాదులో వాడాలి).

కంటి సమస్యలు, అత్యవసర చికిత్స:
చెన్నంగి పువ్వుల రసాన్ని కంటిలో ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే రేచీకటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాల నుంచి రక్తం ఆగకుండా కారుతుంటే, ఆకులను దంచి కట్టు కడితే రక్తం వెంటనే ఆగిపోతుంది. పాము కాటుకు గురైన వారికి అత్యవసర సమయంలో చెన్నంగి ఆకులు, మిరియాల రసాన్ని తాగిస్తూ, కాటు వేసిన చోట ఆకుల పట్టు వేస్తే విషం తీవ్రత తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: చెన్నంగి (కసివింద) మొక్కను కలుపు మొక్కగా భావించవచ్చా?

A: కాదు. ఇది ఆయుర్వేదంలో విలువైన ఔషధ మొక్కగా గుర్తింపు పొందింది.

Q2: చెన్నంగి వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయా?

A: అధిక మోతాదులో వాడితే విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ మోతాదులో ప్రారంభించడం మంచిది.

Q3: చెన్నంగి ఆకులు ఏ వ్యాధులకు ఎక్కువగా ఉపయోగపడతాయి?

A: చర్మ వ్యాధులు, మూత్ర సమస్యలు, వాపులు, కంటి సమస్యలు మరియు గాయాల చికిత్సలో ఉపయోగపడతాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »