నేడు ఆకాశంలో అరుదైన ఖగోళ వింత.. సందడి చేయనున్న ‘బ్లూ మైక్రోమూన్’

స్కైవాచర్లను అరుదైన ఖగోళ దృశ్యం (Celestial Event) కనిపించనుంది. ఆదివారం (మే 31) బ్లూ మైక్రోమూన్ (Blue Micro Moon) దర్శనమివ్వనుంది. ఒకే నెలలో రెండోసారి పౌర్ణమి (Full Moon) సంభవించడం, అదే సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దూరంలో (Apogee) ఉండటంతో సాధారణం కంటే చిన్నగా కనిపించనుంది. దేశవ్యాప్తంగా ఈ అరుదైన ఖగోళ సంఘటన (Rare Lunar Phenomenon)ను కంటితోనే వీక్షించేందుకు అవకాశం ఉంది.

Blue Micro Moon | దేశవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులకు ఆదివారం ప్రత్యేకంగా నిలువనుంది. ఆకాశంలో అరుదుగా కనిపించే ‘బ్లూ మైక్రోమూన్’ దర్శనమివ్వనుంది. ఒకే నెలలో రెండోసారి పౌర్ణమి సంభవించడం, అదే సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దూరంలో ఉండటం వల్ల సాధారణం కంటే చిన్నగా కనిపించనుండటంతో ఈ ఖగోళ ఘటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ఒక క్యాలెండర్‌ నెలలో రెండు పౌర్ణములు రావడం అరుదుగా జరుగుతుంది. 2026 మే నెలలో ఈ విశేషం చోటుచేసుకుంది. నెల ప్రారంభంలో మే 1న ఒక పౌర్ణమి రాగా.. మరో పౌర్ణమి ఆదివారం (మే 31న) ఏర్పడుతోంది. ఖగోళ శాస్త్రంలో ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా వ్యవహరిస్తారు. అయితే, ఈసారి మరో ప్రత్యేకత ఉంది. చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే తన కక్ష్యలోని అపోజీ స్థానానికి చేరుకోనున్నాడు. దీంతో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కొద్దిగా చిన్నగా కనిపిస్తాడు. అందుకే దీనిని ‘మైక్రోమూన్’గా పిలుస్తారు.

Read Also : తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌..

అరుదుగానే..

బ్లూ మూన్‌, మైక్రోమూన్‌ రెండూ ఒకే రోజున కలిసిరావడం చాలా అరుదైన ఖగోళ ఘటనగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఖగోళ పరిశీలకులు, ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్నవారు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిపుణుల వివరాల ప్రకారం.. ఈసారి కనిపించే చంద్రుడు సాధారణ పౌర్ణమి చంద్రుడితో పోలిస్తే సుమారు 6 నుంచి 7 శాతం వరకు చిన్నగా కనిపించనున్నాడు. అలాగే, ప్రకాశం కూడా స్వల్పంగా తక్కువగా ఉండొచ్చు. సాధారణంగా ‘బ్లూ మూన్’ అంటే చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడని అనుకుంటారు. ఖగోళ శాస్త్రపరంగా పెట్టిన పేరుమాత్రమే. చంద్రుడి రంగులో ఎలాంటి మార్పు ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈ ఖగోళ వింతను సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య తూర్పు దిక్కున వీక్షించే అవకాశం ఉంటుంది.

Read Also : భాష ఏదైనా ఫిర్యాదు ఇక సులభం.. ఏఐ కాప్‌రైటర్‌ యాప్‌ని ఆవిష్కరించిన సజ్జనార్‌

ఆకాశం నిర్మలంగా ఉంటే..

ఆకాశం నిర్మలంగా ఉంటే ఎలాంటి టెలిస్కోప్‌, ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే కంటితో స్పష్టంగా చూడవచ్చని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. మరింత స్పష్టంగా పరిశీలించాలనుకునే వారు బైనాక్యులర్‌ లేదా చిన్న టెలిస్కోప్‌ను ఉపయోగించొచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సమయంలో చంద్రుడు స్కార్పియస్‌ నక్షత్ర మండలంలో అత్యంత ప్రకాశవంతమైన అంటారిస్‌ నక్షత్రానికి సమీపంలో కనిపించనున్నాడు. దీంతో ఆకాశంలో చంద్రుడితో పాటు ఆ ఎర్రటి నక్షత్రాన్ని కూడా వీక్షించే అవకాశం లభించనుంది. ప్రకృతి అందాలు, ఖగోళ అద్భుతాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది అరుదైన అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. మేఘాలు అడ్డుకాకపోతే శనివారం సాయంత్రం ఆకాశాన్ని ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.

Read Also : రామ్‌చరణ్‌పై ట్రోల్స్‌.. అర్ధరాత్రి బుమ్రాకు క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ స్టార్‌..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »