హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ‘TG SAFE’ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అక్టోబర్ 8న 12 బృందాలు కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని ఫేని, ఖారా తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన బృందాలు మొత్తం 12 సంస్థలను తనిఖీ చేశాయి.
తనిఖీల్లో పలు సంస్థల్లో అపరిశుభ్ర వాతావరణం, వ్యక్తిగత పరిశుభ్రత లోపాలు, ఈగలు, పురుగుల సమస్య, ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయకపోవడం, తప్పనిసరి రికార్డులు నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. కొన్ని చోట్ల రిటైల్ లైసెన్సులతోనే తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అలాగే గుట్కా, పాన్‌మసాలా మరకలు, అపరిశుభ్రమైన ప్రాంగణాలు, ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్‌నెట్స్ వంటి సరైన వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించకపోవడం కూడా తనిఖీల్లో బయటపడింది. అదనపు పదార్థాలతో కలుషితమైన ఆహారాన్ని అధికారులు అక్కడికక్కడే పారవేయించారు.
రూ.2.30 లక్షల విలువైన 1,950 కిలోల ఫేని స్వాధీనం
ఫేని ఉత్పత్తులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. లేబులింగ్ ఉల్లంఘనలు, నాణ్యతపై అనుమానాల నేపథ్యంలో మొత్తం 1,950 కిలోల ఫేనిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
అడల్టరేషన్‌పై అనుమానంతో 12 శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించారు.
ఐదు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్
నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
సస్పెండ్ చేసిన సంస్థల్లో:
- శ్రీ గణేష్ ఖారా అండ్ ఫేని – భారత్ నగర్ కాలనీ, అత్తాపూర్
- JP Foods – ఇమాంపురా, జియాగూడ
- Prem Puri Sweet Phani Shop – పెట్లా బురుజ్, చార్మినార్
- Mahaveer Namkeen – నాదర్‌గుల్, బడంగ్‌పేట్
- GM Mixture – అత్తాపూర్
మరో ఆరు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో J.P Foods (శివరాంపల్లి, అత్తాపూర్), G.M. Mixtures (కోల్సావాడి, బేగంబజార్), Jaipur Jodpur Phenniwala (మధుబన్ కాలనీ), Bhagirati Foods (ఇమాంపూర్, జియాగూడ), Ram Niwas Puri Sweet Phenniwala (మహబూబ్ గంజ్), Balaji Pheni Udayog (మూసారాంబాగ్) ఉన్నాయి.
లైసెన్స్ లేకుండా వ్యాపారం.. మరో సంస్థపై చర్యలు
జియాగూడలోని భారత్ నగర్‌లో ఉన్న Anjani Foods and Peni Worksపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. FSSAI లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో వ్యాపారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలు
వినియోగదారులు ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లైసెన్స్ ఉన్న ఆహార వ్యాపారుల వద్దే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలిపారు.
ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు, FSSAI వివరాలను పరిశీలించాలని సూచించారు. దుమ్ము, ఈగలు పడేలా బహిరంగంగా ఉంచిన లేదా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
ఆహార వ్యాపారులు పరిశుభ్రత, సరైన FSSAI లైసెన్సింగ్‌తో పాటు తప్పనిసరి రికార్డులను నిర్వహించాలని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాలని TG SAFE అధికారులు సూచించారు.
Safe food begins with safe practices.
On 08 October 2026, 12 TG SAFE enforcement teams comprising Food Safety Officers and Police personnel inspected 12 Pheni and Khara manufacturing and retail establishments across the Core Urban Region (CURE).
Inspections revealed unhygienic premises, poor personal hygiene, pest infestation, improper storage, missing mandatory records and incorrect licence categories in some establishments. Food contaminated with extraneous matter was discarded on the spot.
TG SAFE seized 1,950 kg of Pheni valued at ₹2.30 lakh for labelling violations and suspected quality issues. Twelve samples were collected on suspicion of adulteration.
FSSAI licences of 5 establishments were suspended with instructions to stop business operations immediately. Show-cause notices will be issued to 6 establishments. Anjani Foods and Peni Works, Jiyaguda, was ordered to stop operations for functioning without an FSSAI licence under unhygienic conditions.
Consumers are advised to buy from licensed food businesses, check packaged-food labels, insist on bills and avoid food exposed to dust, flies or unhygienic handling.
Food businesses must maintain hygiene, appropriate licensing and mandatory records to protect public health.
#TGSAFE #Telangana #FoodSafety #FoodSafetyInspections #PublicHealth #ConsumerAwareness #Hyderabad
— TG SAFE (@c_tgsafe) October 8, 2026


