పక్షవాతం వచ్చే ముందు శరీరం ఇచ్చే ‘వార్నింగ్స్’ ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు

పక్షవాతం(Stroke) అనేది మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం లేదా రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధి. అధిక రక్తపోటు, డయాబెటిస్, ఒత్తిడి, తప్పుడు జీవనశైలి వల్ల యువతలో కూడా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతోంది. ముందస్తు లక్షణాలను గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకుంటే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు.

Stroke
Stroke

Stroke

హైదరాబాద్: ఒకప్పుడు పక్షవాతం (Stroke) అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య అని అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు, నేటి బిజీ లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల యువత కూడా ఈ ప్రమాదకర సమస్య బారిన పడుతున్నారు. శరీరంలోని ఏదో ఒక భాగం అకస్మాత్తుగా పని చేయకుండా పోవడం, ప్రాణాపాయ స్థితికి దారితీయడం పక్షవాతం ముఖ్య లక్షణం. అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది? వచ్చే ముందు కనిపించే హెచ్చరికలు ఏంటి? ఎవరికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పక్షవాతం (Stroke)అంటే ఏమిటి?

మెదడులోని ఏదైనా భాగానికి అకస్మాత్తుగా రక్త సరఫరా ఆగిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు పక్షవాతం సంభవిస్తుంది. దీనినే ‘బ్రెయిన్ స్ట్రోక్’ అని కూడా అంటారు. దీనివల్ల మెదడు నియంత్రించే శరీరంలోని ఒక వైపు అవయవాలు (చేయి, కాలు, నోరు) అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి.

ఎందుకు వస్తుంది?

1. వైద్యుల ప్రకారం పక్షవాతం రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

2.రక్తనాళాల్లో అడ్డంకులు (Ischemic Stroke): మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల 85 శాతం పక్షవాతం కేసులు నమోదవుతున్నాయి.

3.మెదడులో రక్తస్రావం (Hemorrhagic Stroke): మెదడులోని రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తస్రావం జరిగి స్ట్రోక్ వస్తుంది.

Stroke
Stroke

ప్రమాదం ఎవరికి ఎక్కువ?

అధిక రక్తపోటు (High BP) ఉన్నవారు, మధుమేహం (Diabetes) బాధితులు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు (High Lipids), గుండె సంబంధిత సమస్యలు లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు, అధిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేని జీవనశైలి గడిపేవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

గుర్తించదగ్గ లక్షణాలు:

పక్షవాతం వచ్చే ముందు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలోని ఒక వైపు భాగం (చేయి లేదా కాలు) అకస్మాత్తుగా బలహీనపడటం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం లేదా మాట తడబాటు, ముఖం ఒకవైపుకు వంకరపోవడం (ముఖ్యంగా నోరు), కంటి చూపు అకస్మాత్తుగా మందగించడం, నడవడం వలన బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

TIA – హెచ్చరిక:

కొందరికి చాలా తక్కువ సమయం పాటు పక్షవాతం లక్షణాలు వచ్చి, ఆ తర్వాత కోలుకుంటారు. దీనిని TIA (Transient Ischemic Attack) అంటారు. ఇది భవిష్యత్తులో రాబోయే పెద్ద పక్షవాతానికి ఒక బలమైన హెచ్చరిక. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

జీవనశైలిని మార్చుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పక్షవాతం ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

పక్షవాతం వచ్చే ముందు హెచ్చరికలు ఉంటాయా?

అవును. మాట తడబాటు, ముఖం ఒకవైపుకు వంగడం, చేతి లేదా కాలి బలహీనత వంటి లక్షణాలు ముందుగా కనిపించవచ్చు.

TIA అంటే ఏమిటి?

తాత్కాలికంగా వచ్చే పక్షవాతం లక్షణాలను TIA అంటారు. ఇది భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్‌కు హెచ్చరికగా భావించాలి.

యువతలో పక్షవాతం ఎందుకు పెరుగుతోంది?

అధిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అనారోగ్య ఆహారం, హై BP, డయాబెటిస్ వంటి కారణాల వల్ల యువతలో కూడా ప్రమాదం పెరుగుతోంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »