వరంగల్, సెప్టెంబర్ 20: వరంగల్ MGM ఆసుపత్రిలో మరోసారి పైకప్పు పెచ్చులూడి పడటంతో రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. False Ceilingకు సంబంధించిన Gypsum Sheets కూలిపడటంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓంకార ఎల్లమ్మతో పాటు మరో Patient ఉన్నట్లు సమాచారం. వీరంతా పక్షవాతంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
తెల్లవారుజామున MGM ఆసుపత్రిలోని Paralysis Wardలో False Ceilingకు సంబంధించిన Gypsum Sheets ఒక్కసారిగా కూలిపడ్డాయి. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న Patientsతో పాటు Attenders భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, వారికి ఆసుపత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి గాయాలకు Bandage చేసినట్లు సమాచారం.
MGM Hospital ceiling collapse injures three in Warangal
A part of the ceiling collapsed in the Aarogyasri ward of Mahatma Gandhi Memorial (MGM) Hospital in Warangal on Sunday, injuring three people. The accident caused panic among patients and their families.#MGMHospital… pic.twitter.com/ItFz0lQzBv
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 20, 2026
పక్షవాతంతో బాధపడుతున్న Patients ఉన్న వార్డులోనే ఈ ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. False Ceiling మొత్తం ఒకేసారి కూలిపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న రోగులు సరిగా స్పందించలేని పరిస్థితిలో ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
MGM ఆసుపత్రి నిర్వహణపై గత కొంతకాలంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరచూ చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎలుకలు కొరకడం, కుక్కలు ఆసుపత్రి ప్రాంగణంలోకి రావడం, పైకప్పు పెచ్చులు ఊడిపడటం వంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నట్లు సమాచారం.
వర్షాకాలంలో పైకప్పులు, Ceilingలకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 12 ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MGM ఆసుపత్రి మరమ్మతులకు సంబంధించి అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. జిల్లా Collector కూడా ఆసుపత్రి మరమ్మతులకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అయితే అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
తాత్కాలికంగా చేపడుతున్న మరమ్మతులు కూడా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని, కొంతకాలానికే మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు చికిత్స కోసం MGM ఆసుపత్రికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే ఆసుపత్రిలోని శిథిలావస్థకు చేరిన భవనాలు, Ceilingsను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. MGM ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రత్యేకంగా Committee ఏర్పాటు చేసి, అవసరమైన నిధులను విడుదల చేసి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రస్తుతం జరిగిన ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించాల్సి ఉంది. అవసరమైన నిధులు విడుదల చేసి మరమ్మతులు చేపడితేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించే అవకాశం ఉంటుందని రోగుల బంధువులు పేర్కొంటున్నారు.


