బ్రెయిన్ షార్ప్‌గా మారాలా? అయితే మీ మెదడుకు ఈ చిన్న వ్యాయామం అవసరమే!

రోజూ అరగంట నడవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి (Memory Power)బలపడుతుంది. మతిమరుపు, మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా మెదడు చురుకుదనం పెరుగుతుంది. మందులకన్నా నడకే మెమరీ పవర్‌కు ఉత్తమ పరిష్కారం.

Daily Walking Improves Memory Power and Brain Health
Daily Walking Improves Memory Power and Brain Health

Memory Power

హైదరాబాద్: స్కూల్లో విన్న పాఠాలు మర్చిపోవడం, పెట్టిన వస్తువు ఎక్కడ ఉందో గుర్తు రాకపోవడం, బజారుకు వెళ్ళాక ఏం కొనాలో కాల్ చేసి అడగడం.. ఇవన్నీ ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు. దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ తగ్గి మెదడు చురుకుదనం మందగించడమే. అయితే, దీనికి మందుల కంటే ‘నడక’ అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు కేవలం అరగంట నడకతో మీ జ్ఞాపకశక్తి(Memory Power)ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, మతిమరుపు (అల్జీమర్స్) వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

కలిగే ప్రయోజనాలు:

జ్ఞాపకశక్తి పెరుగుదల: నడక వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, ఆక్సిజన్, అవసరమైన పోషకాలు అందుతాయి. దీనివల్ల మెదడు కణాల మధ్య అనుసంధానం బలపడి, విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.

హ్యాపీ కెమికల్స్ : మనం నడిచినప్పుడు మెదడులో డొపమైన్, సెరటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ విడుదలవుతాయి. ఇవి మనల్ని మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి దూరం చేసి, ఉల్లాసంగా ఉంచుతాయి.

విటమిన్-డి : ఉదయాన్నే నడవడం వల్ల సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి శరీరానికే కాకుండా మెదడు ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఐసీఎంఆర్ (ICMR): మన దేశంలో దాదాపు 54 శాతం మంది శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారని, ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్లకు బానిసలై నడకను విస్మరిస్తున్నారని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

లాన్సెట్ నివేదిక: రోజుకు కనీసం 7 వేల అడుగులు నడిస్తే మరణ ముప్పు 47 శాతం తగ్గుతుందని, మతిమరుపు సమస్యలు 38 శాతం మేర తగ్గుతాయని ఈ నివేదిక వెల్లడించింది.

ఎయిమ్స్ (AIIMS): వృద్ధులలో నడక తగ్గడం వల్ల మెదడు పరిమాణం, జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు గుర్తించింది. వారానికి కనీసం నాలుగు రోజులు నడక ప్రాక్టీస్ చేస్తే నాడీ సంబంధాలు బలపడతాయని విదేశీ వర్సిటీల అధ్యయనాల్లో కూడా తేలింది.

మరికొన్ని ఆరోగ్య లాభాలు: నడక కేవలం మెదడుకే కాదు.. గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలు, కీళ్లను దృఢంగా ఉంచుతుంది.

జీవితంలో ‘తెలీదు, గుర్తులేదు’ అనే మాటలకు స్వస్తి చెప్పాలంటే, ఇప్పుడే మీ నడకను ప్రారంభించండి. వారానికి కనీసం ఐదు రోజులు, రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: నడక వల్ల నిజంగా మెమరీ పవర్ పెరుగుతుందా?

A: అవును. నడక మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి నాడీ సంబంధాలను బలపరుస్తుంది.

Q2: రోజుకు ఎంతసేపు నడవాలి?

A: రోజుకు కనీసం 20–30 నిమిషాలు, వారానికి 5 రోజులు నడవడం ఉత్తమం.

Q3: వృద్ధులకు కూడా నడక ఉపయోగకరమేనా?

A: ఖచ్చితంగా. వృద్ధుల్లో మెదడు క్షీణతను తగ్గించడానికి నడక చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »